Anil Ravipudi : భగవంత్ కేసరి హిట్.. కోట్ల విలువైన గిఫ్ట్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి

- Advertisement -


Anil Ravipudi : ఈ మధ్యకాలంలో ఏ హీరో సినిమా అయినా హిట్ అయితే ఆ చిత్ర నిర్మాతలు దర్శకులకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తున్నారు. ఈ మధ్య చాలామంది దర్శకులు డైరెక్టర్లకు కాస్ట్లీ కార్లలను ఇస్తున్నారు. ఇటీవల బేబీ సినిమా నిర్మాత.. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన సాయి రాజేష్ కు కూడా ఒక ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చారు. ఇప్పుడు ఆ లిస్టులో అనిల్ రావిపూడి కూడా చేరారు. ఆయన కూడా ఒక కాస్ట్లీ కార్ ని గిఫ్ట్ గా అందుకున్నారు. డైరెక్టర్ అనిల్ రావుపూడి , బాలయ్య హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా.. శ్రీ లీల కీలకమైన పాత్రలో నటించిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది.

Anil Ravipudi
Anil Ravipudi

దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ పరంగా కూడా భారీగానే వసూలు చేసింది. ఈ సినిమా థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా దుమ్ము రేపింది. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ బ్యానర్ పైన సాహు గరికపాటి హరీశ్ రెడ్డి నిర్మించారు. ఈ నేపథ్యంలో నిర్మాతలకు కూడా భారీగా లాభాలు రావడంతో సంతోషంలో డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఓ ఖరీదైన కారు గిఫ్టుగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

Anil Ravipudi Gift

బ్లాక్ కలర్ టయోటా వెల్ఫర్ కారును చిత్ర నిర్మాతలు అనిల్ రావిపూడి కి బహుమతిగా ఇచ్చారు. ఈ కారు ధర 1.55 కోట్ల రూపాయలని సమాచారం. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు మేకర్స్ అధికారికంగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి కూడా తన తదుపరి చిత్రం కోసం కథలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈసారి ఏ హీరోతో చేయబోతున్నారో తర్వలోనే వెల్లడించనున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here