ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే పవన్ కళ్యాణ్ కి వీర భక్తుడిగా బండ్ల గణేష్ కి పేరుంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ లలో బండ్ల పాల్గొంటూ ఇచ్చే స్పీచ్ లకి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. అలానే బండ్ల గణేష్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. అభిమానులకు టచ్ లో ఉంటూ వారి ట్వీట్ లకు రెస్పాండ్ అవుతూ ఉంటారు.’

అయితే ప్రముఖ దర్శకుడు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ని అందరూ గురూజీ అని ఎక్కువగా సంభోదిస్తూ ఉంటారు. ఈయన కూడా పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తులు అని తెలిసిందే. కాగా గత కొంత కాలంగా బండ్ల గణేష్ – త్రివిక్రమ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా ఇష్యూ నడుస్తుంది అని టాలీవుడ్ లో టాక్ ఉంది. ఇప్పుడు తాజాగా ఈ వివాదం మరోసారి బయట పడింది. తాజాగా ఓ నెటిజన్ ప్రొడ్యూసర్ కావాలంటే ఏం చేయాలి అని బండ్ల గణేష్ కి ట్వీట్ చేశాడు. దీనికి బండ్ల గణేష్ రిప్లై ఇస్తూ.. గురూజీని కలిసి కాస్ట్‌లీ గిఫ్ట్ ఇవ్వు అయిపోతావు అని ట్వీట్ చేశాడు.

అలానే మరో నెటిజన్.. గురూజీకి కథ చెప్తే స్క్రీన్ ప్లే రాసి దానికి తగ్గట్టు కథ మార్చి, ఆ కథని షెడ్ కి పంపిస్తారని టాక్ ఉంది అని బండ్ల గణేష్ కి ట్వీట్ చేయగా, దీనికి బండ్ల గణేష్ సమాధానమిస్తూ.. అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే అది మన గురూజీ స్పెషాలిటీ అని ట్వీట్ చేశాడు. దీంతో బండ్లన్న ట్వీట్ వైరల్ గా మారింది.
గత ఏడాది ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తనను త్రివిక్రమ్ పిలవద్దని చెప్పాడంటూ.. బండ్ల గణేష్ ఫోన్ కాల్ ఆడియో లీక్ అయ్యి.. ఫుల్ ట్రెండింగ్ అయ్యింది. ఆ తర్వాత బండ్ల గణేష్ కూడా అవి నేను చెప్పినవే అని అందుకు త్రివిక్రమ్ కి కూడా సారీ చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం వివాదాస్పదంగా మారింది. ఇక ఈ విషయంలో కొందరు బండ్ల గణేష్ కి సపోర్ట్ చేస్తుంటే.. మరి కొందరు త్రివిక్రమ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి అయితే ఈ వ్యవహారంపై ఎవరో ఒకరు నోరు విప్పితే కానీ తగ్గేలా లేదు.