నందమూరి బాలకృష్ణ కి టాలీవుడ్ లో ఎలాంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ మొదటి సినిమా నుండే తన మార్కుని ఏర్పాటు చేసుకోవడం లో బాలయ్య సక్సెస్ అయ్యాడు. మధ్యలో చెత్త సినిమాలు చేసి మార్కెట్ మొత్తం పోగొట్టుకున్నప్పటికీ, ‘అఖండ’ చిత్రం నుండి ఆయన ఏ స్థాయి సినిమాలను చేస్తూ ముందుకు పోతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం .

పొరపాటున కూడా ఇక బాలయ్య ఫ్లాప్ సినిమాలు తియ్యడు అని అనిపించేలా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన కెరీర్ ఇలా యూ టర్న్ తీసుకోవడానికి ప్రధాన కారణం చిన్న కూతురు తేజస్విని వల్లే అని చెప్పొచ్చు. అఖండ చిత్రం నుండి బాలయ్య కెరీర్ ని ప్లాన్ చేసింది ఆమెనే. యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలను సెట్ చేస్తూ, నేటి తరం ఆడియన్స్ కి ఎలా వెళ్తే రీచ్ అవుతాము అనే దానిపై ఆమె చేసిన కసరత్తులు మామూలివి కావు.

ఇవన్నీ పక్కన పెడితే తేజస్విని భరత్ అనే అతన్ని పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇతను మాజీ వైజాగ్ ఎంపీ. అయితే భరత్ కంటే ముందు తేజస్విని అప్పట్లో ఒక టాలీవుడ్ యంగ్ హీరో తో ప్రేమాయణం నడిపింది అట. అప్పట్లో వీళ్ళు కలిసి విదేశీ పర్యటనలు కూడా చాలానే చేసారు. హైదరాబాద్ లో పార్టీలకు, పబ్బులకు తిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీ మీద అప్పట్లో తేజస్విని కి పెద్దగా అవగాహనా ఉండేది కాదట.

తేజస్విని పలానా యంగ్ హీరో తో డేటింగ్ అనగానే ఆ విషయం తెలుసుకున్న బాలయ్య వెంటనే అతని గురించి విచారించగా, అతను కరెక్ట్ మనిషి కాదని, ప్రస్తుతం తేజస్విని తో పాటుగా మరో ఇద్దరు అమ్మాయితో ప్రేమాయణం నడిపాడని తెలిసింది. అప్పుడు కోపం తో రగిలిపోయిన బాలయ్య నేరుగా ఆ యంగ్ హీరో ఇంటికి వెళ్లి, ఇక నుండి నా కూతురి జీవితం లో కానీ, ఈ ఇండస్ట్రీ లో కానీ కనిపిస్తే నీకు పుట్టగతులు లేకుండా చేస్తాను అని వార్నింగ్ ఇవ్వడం తో అతని మన ఇండస్ట్రీ ని వదిలి పారిపోయాడు అట. ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.
