Actress Rohini : రోహిణిని తన బాయ్​ఫ్రెండ్ అంత దారుణంగా హింసించాడా.. ప్రియుడి మోసం బయటపెట్టిన నటి!

- Advertisement -

Actress Rohini : రోహిణి అంటే అంతగా గుర్తుపట్టరేమో కానీ రౌడీ రోహిణి అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈ భామ బుల్లితెరను ఏలేస్తోంది. ఓవైపు సీరియల్స్.. మరోవైపు రియాల్టీ షోస్.. ఇంకోవైపు కామెడీ షోస్ చేస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపోతంది. సీరియల్స్​తో తన కెరీర్ షురూ చేసిన రోహిణి ఆ తర్వాత బిగ్​బాస్ షోతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది మాయా అంటూ తనదైన స్లాంగ్​తో ఈ బ్యూటీ పలికే సంభాషణలు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.

Actress Rohini
Actress Rohini

నెమ్మదిగా ఈ భామ వెండితెరపైనా అడుగుపెట్టింది. చిన్నచిన్న పాత్రలను దక్కించుకుంటూ సిల్వర్ స్క్రీన్​పై మెరిసిపోయే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల రోహిణి తన కాలు సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్న ఈ భామ మళ్లీ తెరపై కనిపించేందుకు రెడీ అవుతోంది. అయితే తాజాగా ఈ భామ తన లవ్ లైఫ్ గురించి మాట్లాడింది.


ఓ షోలో పాల్గొన్న రోహిణి తన బ్రేకప్ గురించి చెప్పింది. ఇప్పటి వరకు రోహిణి లవ్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆమెకు లవర్ ఉన్నాడా లేదా అన్నది ఎప్పుడూ చర్చకు రాలేదు. అయితే తాజాగా ఓ షోలో ఈ విషయాన్ని బయటపెట్టింది రోహిణి. తనకు ఒకప్పుడు బాయ్‌ ఫ్రెండ్‌ ఉండేవాడని కానీ కొన్నాళ్ల క్రితం విభేదాల వల్ల విడిపోయినట్లు చెప్పుకొచ్చింది. దానివల్ల చాలా నరకం అనుభవించానని.. ఆ బాధ తట్టుకోలేక డిప్రెషన్​లోకి వెళ్లానని తెలిపింది. అయితే ఆ సమయంలో రోహిణికి ఫ్రెండ్స్‌ ఎంతగానో సపోర్ట్‌గా ఉన్నారట.

- Advertisement -


‘నా బాయ్​ఫ్రెండ్ నాతో పాటు ఇంకో అమ్మాయితో కూడా ప్రేమాయణం నడిపాడు. ఆ విషయం తెలిసి నిలదీసేసరికి అవును నిజమేనని చెప్పాడు. ఇద్దరితో ప్రేమేంట్రా అని గట్టిగా అడిగేసరికి ఏం మాట్లాడలేదు. ఎంతో నమ్మకంతో ప్రేమిస్తే.. చీట్‌ చేశాడు. అలాంటి వాడితో ఉండటం ఇష్టం లేక బ్రేకప్ చెప్పేశాను. అతడిచ్చిన షాక్​తో మళ్లీ ప్రేమ జోలికి పోలేదు. ఆ గాయం నుంచి కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది’ అంటూ రోహిణి ఎమోషనల్ అయింది.

‘నా బ్రేకప్ తర్వాత చాలా డిప్రెషన్​లోకి వెళ్లిపోయాను. అప్పుడు నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్​గా నిలిచారు. ఏమైపోతాననో చాలా బాధపడ్డారు. వాళ్ల బాధను చూడలేకపోయాను. ఆఫ్ట్రాల్ వాడి కోసం నేను ఆలోచించడం ఏంటని అనిపించింది. వాడి కోసం నేను బాధ పడటమే గాక.. నా వాళ్లందర్నీ బాధ పెడుతున్నాననిపించింది. ఆ క్షణం ఇక ఆ జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చేశాను’. అని రోహిణి చెప్పుకొచ్చింది. అయితే తన లవర్ పేరు మాత్రం రోహిణి రివీల్ చేయలేదు. దీంతో ఈ రౌడీ రోహిణిని అంతలా బాధపెట్టిన వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు తెగ తలలు బద్ధలు కొట్టేసుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here