Balakrishna : నందమూరి బాలకృష్ణ తెరిచిన పుస్తకం లాంటిది, ఆయన జీవితం లో జరిగిన ప్రతీ అంశం మనకి తెలుసు.కానీ పైకి కనిపించే బాలయ్య వేరు,లోపల కనిపించే బాలయ్య వేరని ఆయనని దగ్గరగా చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు.బాలయ్య చాలా కోపిష్టి అని,అభిమానులను ఎప్పుడూ కొడుతుంటాడని, ఇలా మన కళ్ళకి కనిపించేవాటిని చూసి బాలయ్య వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఉంటాము.
కానీ బాలయ్య అసలు రూపం ఏంటో, ఆయన అందరితో ఎంత స్నేహం గా ఉంటాడో అనేది ‘అన్ స్టాపబుల్’ షో ద్వారా తెలిసిందే.అయితే రీసెంట్ గా బాలయ్య గురించి ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ రాపాక చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.బాలయ్య మనస్సు వెన్నలాంటిదని,స్నేహానికి ప్రేమకి ఆయన ఎంతో విలువ ఇస్తాడని, ఒక్కసారి ఆయన ఎవరినైనా నమ్మితే ప్రాణం పెడతాడని ఈ సందర్భంగా ఆమె తెలిపింది.
అంతే కాకుండా ఈ ఇంటర్వ్యూ లో ఆమె బాలయ్య గురించి మనకి తెలియని ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది. ఆ రోజుల్లో బాలయ్య ఒక ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని ఘాడంగా ప్రేమించాడట. తానే జీవితంగా బ్రతుకుతూ, చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అయితే ఈ విషయం తెలుసుకున్న సీనియర్ ఎన్టీఆర్ మరియు హరికృష్ణ బాలయ్య ని చాలా గట్టిగా మందలించారట.
‘ఈమధ్య పార్టీలకు బాగా వెళ్తున్నట్టు ఉన్నావ్. అమ్మయిలతో కూడా బాగా తిరుగుతున్నావు అని నాకు తెలిసింది, నీ వాళ్ళ కుటుంబానికి చెడ్డపేరు రాకూడదు. అర్జెంటు గా ఇక్కడితో అన్నీ ఆపేయి’ అని వాళ్లిద్దరూ హెచ్చరించారట. దీనితో బాలయ్య అయిష్టంగానే తన ప్రేమని చంపుకొని ఎంతో మానసిక వేదనకు గురయ్యాడట.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఏమిటో ఆమె ఈ ఇంటర్వ్యూ లో చెప్పలేదు కానీ, బాలయ్య ప్రేమ వ్యవహారం నడిపింది ఎవరితో అంటే అప్పట్లో రూమర్స్ ప్రకారం విజయశాంతి తో అని అందరూ అంటూ ఉంటారు. కానీ అది కేవలం రూమర్ మాత్రమే, బాలయ్య ప్రేమించిన ఆ ప్రముఖ స్టార్ హీరోయిన్ ఇప్పటి వరకు బాలయ్య తో కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదట. వెంకటేష్ మరియు నాగార్జున సరసన నటించింది, చిరంజీవి కి కూడా అక్కగా ఒక చిత్రం లో నటించింది.ఆమె ఎవరో ఈపాటికే మీకు అర్థమై ఉండాలి.ఎవరో గెస్ చెయ్యండి..?