Balagam Venu : జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ ని సంపాదించి టాలీవుడ్ లో టాప్ రేంజ్ కి వెళ్లిన కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది సీనియర్ కమెడియన్స్ కి కూడా ఈ షో మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. అలాంటి కమెడియన్స్ లో ఒకడు వేణు. ఈయన జబర్దస్త్ కి ముందు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటించాడు కానీ జబర్దస్త్ అతనికి పునర్జన్మని ఇచ్చింది.

తాను మాత్రమే ఎదగడం కాకుండా సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను వంటి టాలెంట్ ఉన్న కుర్రాళ్లకు తన స్కిట్స్ లో అవకాశాలు ఇచ్చాడు. నేడు వాళ్లంతా ఏ రేంజ్ లో ఉన్నారో మన అందరం చూస్తూనే ఉన్నాం. సుడిగాలి సుధీర్ ఒక పక్క సినిమాల్లో హీరో గా కొనసాగుతూనే మధ్యలో కమెడియన్ గా కూడా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక గెటప్ శ్రీను గురించి మన అందరికీ తెలిసిందే , ఇప్పుడు ఆయన లేని సినిమా లేదు.

అలా ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన వేణు, రీసెంట్ గా ‘బలగం’ చిత్రం తో దర్శకుడిగా మారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్టై 13 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు వేణు ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో కలిసి నాని హీరో గా తెరకెక్కబోయే సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు.

ఒక కమెడియన్ స్థాయి నుండి నేడు ఇండస్ట్రీ లో టాప్ స్టార్స్ లో ఒకడిగా కొనసాగుతున్న నాని లాంటి హీరో తో సినిమా తీసే రేంజ్ కి ఎదగడం మామూలు విషయం కాదు. ఇది కాసేపు పక్కన పెడితే బలగం వేణు ఇండస్ట్రీ లోకి రాకముందు తన తల్లితండ్రులతో కలిసి కూరగాయల వ్యాపారం చేసేవాడు. తన చుట్టుపక్కన ఉన్న వాళ్ళతో పోలిస్తే తాను కాస్త డిఫరెంట్ గా ఉండాలనే ఉద్దేశ్యం తో ఆయన కరాటే నేర్చుకొని రెండు సార్లు స్టేట్ ఛాంపియన్ గా నిలిచాడు. ఆ తర్వాత సినిమాల మీద మక్కువతో ఇటు వైపుకు వచ్చాడట.
