Balagam Movie : ఇప్పటికే 100 అవార్డులు దక్కించుకుని.. మరో సెన్సేషన్ సృష్టించిన బలగం సినిమా

- Advertisement -


Balagam Movie : టాలీవుడ్ నటుడు, కమెడియన్ వేణు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో తనదైన శైలి కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి టాప్ కమెడియన్ గా ఎదిగారు. అలాంటి ఆయన తొలిసారి మెగా ఫోన్ చేపట్టి తీసిన సినిమా బలగం. ఆ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రతి ఊరిలో తెరలు కట్టి మరీ ప్రదర్శించారంటే ఈ సినిమా ఎంతటి ప్రజాదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఈ దశాబ్ధపు మేటి చిత్రంగా బలగం నిలిచిపోతుందనడంలో సందేహమే లేదు.

Balagam Movie
Balagam Movie

ఈ సినిమా రిలీజై చాలా కాలం అవుతున్నప్పటికీ ఇప్పటికీ ప్రతి ఒక్క ప్రేక్షకుడి మదిలో నిలిచిపోయింది. ఈ సినిమా ఇటీవల మరోసారి ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా లో ప్రసారమైంది. ఇక ఈ మూవీ మంచి టిఆర్పి రేటింగ్ ను రాబట్టింది. 6.05 టిఆర్పి రేటింగ్ నమోదు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ థియేటర్ పరంగానే భారీ వసూళ్లను నమోదు చేసిందనుకుంటే.. టీవీ లో కూడా భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంది.

Balagam Movie

ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చూసాం. కానీ ఇలాంటి సినిమాని ఎప్పుడూ చూడలేదు. ఎన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చినప్పటికీ ప్రతి ఇంట్లో జరిగే ఇలాంటి సంఘటనలు కళ్లకు అద్దినట్లు చూపించిన బలగం మూవీ మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here