Balagam ఇటీవల కాలం లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘బలగం’ అనే చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ ప్రభంజనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతూనే ఉంది.ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం లో ఈ సినిమాకి వస్తున్న రోజు వారి వసూళ్లు #RRR చిత్రం కంటే ఎక్కువ వస్తున్నాయి అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

అద్భుతం ఏమిటంటే తెలంగాణలోని కరీంనగర్ వంటి ప్రాంతం లో కేవలం 50 వేల రూపాయిల గ్రాస్ ఓపెనింగ్ తో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పుడు 50 లక్షల రూపాయిల గ్రాస్ కి చేరుకుంది.ఇలా రీసెంట్ గా విడుదలైన ఏ చిన్న సినిమాకి కూడా జరగలేదు.మంచి సినిమా తీస్తే జనాలు ఏ రేంజ్ లో నెట్టిపెట్టుకొని చూసుకుంటారో అనేందుకు ఉదాహరణ ఇదే.ఇక నిన్న ఉగాది సందర్బంగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

కేవలం నిన్న ఒక్క రోజే ఈ చిత్రానికి తెలంగాణ ప్రాంతం లో కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.నిన్న విడుదలైన విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ మొదటి రోజు వసూళ్లతో సమానం ఇది.ఇప్పటి వరకు 22 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేస్తే, అందులో 16 కోట్ల రూపాయిలు కేవలం తెలంగాణ ప్రాంతం నుండే వచ్చాయి.ఈ సినిమా రన్ ఇప్పట్లో ఆగదు కూడా.

ఊపు చూస్తూ ఉంటే కేవలం తెలంగాణ ప్రాంతం నుండి 30 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.ప్రతి రోజు సగటున ఈ సినిమా 70 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేస్తూ ఉంది.కర్ణాటక ప్రాంతం లో కాంతారా చిత్రం ఎలా అయితే ఆడిందో, మన రెండు తెలుగు స్టేట్స్ లో ‘బలగం‘ చిత్రం కూడా అలా అన్నమాట.
