Balagam : కథ నాది..దమ్ముంటే నాతో తేల్చుకో అంటూ వేణు సవాల్

- Advertisement -

Balagam : దిల్ రాజు నిర్మాణ సంస్థ లో తెరకెక్కిన ‘బలగం’ అనే చిన్న చిత్రం ఈమధ్యనే విడుదలై విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే.ప్రియదర్శి మరియు కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాకి ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించాడు.అయితే ఈ సినిమా కథ నాదే అంటూ రీసెంట్ గడ్డం సతీష్ అనే పాత్రికేయుడు మీడియా ముందుకు వచ్చి వేణు పై మరియు దిల్ రాజు పై చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Balagam
Balagam

‘పిచ్చికి’ అనే పేరుతో నేను రాసిన ఒక కథ అప్పట్లో ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికలో కూడా ప్రచురితం అయ్యింది.ఆ కథ వల్లే నాకు అక్కడ ఉద్యోగం కూడా దొరికింది.నా అనుమతి లేకుండా డైరెక్టర్ వేణు మరియు నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని తెరకెక్కించారు.నా పేరు సినిమాలో కచ్చితంగా పడాల్సిందే, లేకుంటే కోర్టుకి వెళ్లి న్యాయపోరాటం చేస్తాను అంటూ అతను చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తున్నాయి.

gaddam

దీనిపై ఆ చిత్ర దర్శకుడు వేణు స్పందించాడు..ఆయన మాట్లాడుతూ ‘ఆయనెవరో సతీష్ అంట,ఈ కథ నాదే అంటూ మీడియా ముందుకు వచ్చి హంగామా చేస్తున్నాడు.’కాకి ముట్టుడు’ అనేది తెలుగు సంప్రదాయం.అది ఏ ఒక్కరి సొత్తు కాదు ,దీని మీద ఎవరైనా కథలు రాసుకోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు.అంతే కానీ ఇది నా కథ అంటే ఎలా?,చావు పైన ఇది వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి.ఎవరి కోణం వారిది,నేను నా కోణం లో తెలంగాణ సంప్రదాయాలను వెండితెర మీద ఆవిష్కరిస్తూ తీసాను.

- Advertisement -
dil raju

ఆ కోర్టు కి వెళ్లి తేల్చుకుంటాను అంటున్నాడు కదా, తేల్చుకోమనండి వాళ్ళే న్యాయం చెప్తారు.నేనైతే ఇప్పటి వరకు ఆయన కథనే చదవలేదు.అయితే ఈ సందర్భంగా ఒక్కటే చెప్తున్నా, ఏదైనా తేల్చుకోవాలి అనుకుంటే నాతోనే తేల్చుకోండి, దిల్ రాజు గారిని ఇందులోకి లాగొద్దు,ఆయన కేవలం నిర్మాత మాత్రమే, ఆ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం నాది.ఏదైనా మనమే తేల్చుకుందాం, దిల్ రాజు గారి జోలికి వస్తే ఊరుకోను’ అంటూ వేణు ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేసాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here