Balagam Budget పాన్ ఇండియన్ సినిమాలు , కమర్షియల్ సినిమాలు మరియు లవ్ స్టోరీలు ఎక్కువగా తీసే దిల్ రాజు, అప్పుడప్పుడు బిజినెస్ ని చూడకుండా కొన్ని మంచి సినిమాలు కూడా చేస్తుంటాడు.ఆయన అదృష్టం బాగుటుంది కాబట్టి ఆ సినిమాలు కూడా సక్సెస్ సాధించేస్తాయి.అలా ఆయన ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేకుండా, కథని నమ్మి తీసిన లేటెస్ట్ చిత్రం ‘బలగం’.ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ వేణు టిల్లు దర్శకుడిగా మారి తీసిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.
తెలంగాణ గ్రామీణ సంప్రాదయాన్ని వెండితెర మీద అణువణువునా ఉట్టిపడేలా చాలా సింపుల్ కథతో చక్కటి హ్యూమర్ మరియు ఎమోషన్స్ ని మిక్స్ చేసి తీసిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి వసూళ్లను రాబడుతుంది.అయితే ఈ సినిమాకి ఈ స్థాయి బజ్ రావడానికి కారణం దిల్ రాజు మార్కెటింగ్ స్కిల్స్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈ చిత్రం విడుదలకు వారం ముందే తెలంగాణలోని కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో ప్రీమియర్ షోస్ వేయించాడు దిల్ రాజు..ఈ షోస్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అలా వచ్చిన రెస్పాన్స్ ని సోషల్ మీడియా లో బాగా ప్రమోట్ చేయించుకోవడం సక్సెస్ అయ్యాడు,ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి KTR వంటి ప్రముఖులను ఆహ్వానించి సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయ్యేలా చేసాడు.అలా తాను తీసిన ఒక మంచి సినిమాని కమర్షియల్ గా కూడా జనాలకు రీచ్ అయ్యేందుకు అన్ని దారులను వెతికాడు.
చివరికి ఆయన స్ట్రాటజీ ఫలించింది.మొదటి రోజు అనుకున్న స్థాయి ఓపెనింగ్స్ రాకపోయినప్పటికీ, రెండవ రోజు నుండి వసూళ్లు బాగా పుంజుకున్నాయి.అలా కోటి రూపాయిల బడ్జెట్ లోపే తీసిన ఈ సినిమా రెండు రోజులకు కలిపి రెండు కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లను సాధించినట్టు తెలుస్తుంది.లాంగ్ రన్ లో మరింత వసూళ్లు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు,దిల్ రాజు రాబోయే రోజుల్లో కూడా మంచి సినిమాలను ఇలాగే ప్రోత్సహించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.