Samantha : టాలీవుడ్‌ కు గుడ్ బై చెప్పనున్న సమంత..? తొక్కేస్తున్నారా??

- Advertisement -

Samantha : తెలుగు లో టాప్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస హిట్ సినిమాలను తనఖాతాలో వేసుకుంటూ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది..ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఏ మాయ చేసావే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సమంత. మొదటి సినిమానే మంచి గుర్తింపు తెచ్చి పెట్టడంతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది. దాంతో కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా నటించింది.. మొన్నటివరకు అరుదైన వ్యాధితో బాధపడింది.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుడ్ బిజీగా ఉంది.. అయితే సామ్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది…

samantha
samantha

అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ రేంజ్ లో కూడా తన టాలెంట్ నిరూపించుకుంటుంది.. అక్కినేని నాగచైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా వెళ్లిందో అప్పటినుండి ఈమెకు మరింత గుర్తింపు లభించింది. కానీ ఆ గుర్తింపుని ఎక్కువ రోజులు ఉంచుకోకుండా విబేధాల కారణంగా విడాకులతో దూరమైంది. విడాకుల తర్వాత సమంత సినిమాల్లో మరింత గ్లామరస్ గా కనిపిస్తూ ఎక్స్పోజింగ్ చేస్తూ వస్తోంది.. వ్యాధి నుంచి కోలుకున్నాక గ్లామర్ డోస్ పెంచేసింది…అయితే ఇప్పుడు తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.

actress samantha
actress samantha

అంతేకాదు దానికి క్లారిటీ ఇదే అంటూ కొంతమంది ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇక అందులో ఏముందంటే సమంత కన్నడ లో ఒక ఫేస్ వాష్ కి సంబంధించి యాడ్ లో నటించింది. ఇక ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్స్ సమంత ఇకపై తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతుందా అని టెన్షన్ పడుతున్నారు..అందుకు రీజన్ కూడా ఉంది.. ఈ మధ్య తెలుగులో ఒక్క సినిమాకు కూడా సైన్ చెయ్యలేదు. కావాల‌నే సమంత‌ను తొక్కేందుకు టాలీవుడ్‌లో కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, అందుకే స‌మంత‌కు అవకాశాలు రావ‌ట్లేదంటూ కొంద‌రు కోడి గుడ్డు మీద ఈక‌లు పీకే ప‌నిలో ఉన్నారు. ఇదే విషయం బాగా ట్రోల్ అవుతుంది.. మరి నిజమేంటో సమంతనే చెప్పాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here