Balagam ఇటీవల కాలం లో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాయి.ఒక సినిమా హిట్ అవ్వాలంటే పెద్ద స్థాయి గ్రాఫిక్స్, భారీ తారాగణం, ఇవేమి అవసరం లేదు, కేవలం కథ ఉంటే చాలు అని చాటిచెప్పిన చిత్రాలు మన టాలీవుడ్ లో ఎన్నో ఉన్నాయి.ఇప్పుడు అలాంటి చిత్రాల జాబితాలోకి వచ్చేసింది ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ వేణు టిల్లు దర్శకత్వం వహించిన ‘బలగం’ అనే చిత్రం.

తెలంగాణ గ్రామీణ నేపధ్యాన్ని వెండితెర మీద ఆవిష్కుతం చెయ్యడానికి వేణు చేసిన ప్రయత్నం ఫలించింది.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇలాంటి కథలను నమ్మి డబ్బులు పెట్టడానికి ముందుకొచ్చినందుకు, నిజంగా ఆయనకీ కూడా హాట్స్ఆఫ్ చెప్పుకోవాలి.అతనికి ఉన్న స్టేటస్ కి కేవలం స్టార్ హీరోలతో సినిమాలు, పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమాలను తీసుకోవచ్చు.కానీ కమర్షియల్ పెద్దగా వర్కౌట్ కాదు అని తెలిసి కూడా ‘బలగం’ లాంటి సినిమాలను ప్రేక్షకులకు అందించాలి అనుకున్నాడంటే సినిమాపై ఆయనకీ ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థం అయ్యేలా చేసింది.

ఎలాంటి లాభం ఆశించకుండా కేవలం తెలంగాణ గ్రామీణ సంస్కృతి ని వెండితెర పై చూపించే ప్రయత్నం మాత్రమే చేసారు.కానీ ఆడియన్స్ ఆ ప్రయత్నం ని ఎంతగానో మెచ్చి ఈ సినిమాకి అద్భుతమైన వసూళ్లను ఇచ్చారు.నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో దిల్ రాజు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే తెలంగాణ ప్రాంతం లో రెండు కోట్ల రూపాయిల గ్రాస్ మరియు కోటి రూపాయిల షేర్ ని వసూలు చేసిందని చెప్పాడు.ఇక సోమవారం రోజు వర్కింగ్ డే అయ్యినప్పటికీ కూడా తెలంగాణ లో ఈ సినిమాకి ఆక్యుపెన్సీలు అదిరిపోయాయట.

నిన్న కూడా ఈ చిత్రం తెలంగాణ నుండి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను సాధించిందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.అలా ఇప్పటి వరకు కోటి 20 లక్షల రూపాయిల షేర్ కేవలం తెలంగాణ ప్రాంతం నుండి వసూలు చేసిన ఈ సినిమా రాబొయ్యే రోజుల్లో మరింత మరో రెండు నుండి మూడు కోట్ల రూపాయిలు అదనంగా షేర్ ని రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.తెలంగాణ ప్రాంతం నుండి ఈ సినిమాకి వస్తున్న అద్భుతమైన వసూళ్లు మరియు టాక్ చూసి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ చిత్రానికి బాగా డిమాండ్ పెరిగిపోయింది.కనీసం కోటి రూపాయిల బడ్జెట్ కూడా ఖర్చు చెయ్యని ఈ సినిమాకి ఇంత వసూళ్లను రాబట్టడం చూస్తుంటే జనాలు ఎంత గొప్పవాళ్ళు అనేది అర్థం అవుతుంది.
