స్టార్ హీరోయిన్ అనుష్క కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో బాహుబలి ఒకటి. దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా రానా ప్రతినాయకుడిగా నటించి అలరించారు. ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనం ఇంతా ఇంతా కాదు. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. మొదటి పార్ట్ లో బానిసగా.. సెకండ్ పార్ట్ లో యువరాణి గా నటించి అలరించింది. అనుష్క నటనకు మంచి గుర్తింపు వచ్చింది.

ఒక పాత్రలో ప్రభాస్ తల్లిగా.. మరో పార్ట్ లో ప్రభాస్ భార్యాగా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలో అనుష్క పాత్రకు డూప్ గా నటించింది ఎవరో తెలుసా..? ఆమె కూడా ఓ హీరోయిన్.. ఈ అమ్మడు చూడటానికి అచ్చం అనుష్క లానే ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఇద్దరు ఒకేలా ఉంటారు. అదే హైట్ , అదే కలర్ తో ఉంటారు. ఇంతకు అమ్మడు ఎవరు అంటే.. రుషిక రాజ్. 2021 లో వచ్చిన ‘అశ్మీ’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె బోల్డ్ గా నటించి మెప్పించింది రుషిక రాజ్. అనుష్కకు డూప్ గానే కాదు. బ్యా గ్రౌండ్ ఆర్టిస్ట్ గానూ కనిపించింది ఈ చిన్నది.

అయితే ఇలాంటి ఒక సినిమాలో అనుష్క పాత్రకు కొన్ని సన్నివేశాలు డూప్ ని పెట్టి నిర్మించినట్లుగా ఎవరికీ అనుమానం రాదు. ఇక ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆమె అంతలా అనుష్క క్యారెక్టర్ లో మునిగిపోయి నటించింది కాబట్టి .ఆమె కూడా చూడడానికి అచ్చం అనుష్కలాగే ఉంటుంది. కాబట్టి ఆమెను డూప్ అని అస్సలు అనుకోరు. చూసిన వెంటనే ఆమె అనుష్క కాదని గుర్తుపట్టలేరు. అంతలా తన నటనతో తన పోలికలతో అదరగొట్టేసింది ఆమె. అయితే ఈ క్రమంలోనే అనుష్క ఎవరు అని ఆరాతీస్తున్నారు చాలామంది.