Baby Movie : ‘బేబి’ ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. దాదాపు రూ.100 కోట్ల వరకు వసూళ్లను ‘బేబి’ సాధించింది. భారీ వసూళ్లతో పాటు గట్టి ఇంపాక్ట్ కూడా చూపించింది. ఇప్పుడు ‘బేబి’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా ‘బేబి’ నిర్మాత ఎస్‌కేన్, దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే ‘బేబి’ డైరెక్టర్ సాయి రాజేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు. కొత్త దర్శకుడు రవి నంబూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. 2024 సమ్మర్ సీజన్‌లో ఈ సినిమా విడుదల కానున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. ‘బేబి’ సినిమాకు బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన విజయ్ బుల్గానిన్‌నే ఈ సినిమాకు కూడా స్వరాలు సమకూర్చనున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు ప్రకటించారు.

మరోవైపు ఇటీవలే నిర్మాత ఎస్‌కేన్ తాను నిర్మించబోయే తర్వాతి చిత్రాల అప్‌డేట్స్ కూడా అందించారు. తన సొంత నిర్మాణ సంస్థ మాస్ మూవీ మేకర్స్ పై ఈసారి ఏకంగా నాలుగు సినిమాలు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నలుగురు దర్శకులతో కలిసి దిగిన ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో బేబి సినిమాలో కంటే ఎక్కువ బోల్డ్ సీన్స్ పెట్టాలనే ఆలోచనలో ఉందట చిత్ర యూనిట్..