బ్రో సినిమా రాకతో కాస్త స్పీడ్ తగ్గినా.. ఉన్నంతలో బెటర్‌గానే పర్‌ఫార్మ్ చేస్తుంది బేబి సినిమా. ఈ మధ్య కాలంలో ఈ రేంజ్‌లో హిట్టయితే చూడలేదు. పట్టుమని పది కోట్ల బడ్జెట్ కూడా లేని సినిమా ఏకంగా డెబ్బై కోట్ల రేంజ్‌లో కలెక్షన్‌లు కొల్లగొట్టిందంటే ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 13రోజులు కోటికి పైగా షేర్‌ను సాధించడం అంటే మాములు విషయం కాదు. పెద్ద పెద్ద హీరోలే ఆ ఫీట్‌ను అందుకోలేకపోతుంటే.. అసలు మార్కెటే లేని ఆనంద్ దేవరకొండ ఈ ఫీట్‌ను సాధించాడంటే విశేషమే.
ఒక్క ఆనంద్ అనే కాదు వైష్ణవి, విరాజ్ సహా టీమ్ అంతా ది బెస్ట్ ఇచ్చి ఇలాంటి అవుట్ పుట్‌ను రాబట్టారు. యూత్ మాత్రం ఈ సినిమాకు తెగ కనెక్ట్ అయిపోయి ట్రిపుల్ బ్లాక్ బస్టర్‌ను చేసేశారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆగస్టు తొలివారం నుంచి ఈ సినిమా డైరెక్టర్ కట్‌తో ప్రదర్శితం కానున్నట్లు తెలుస్తుంది. అంటే నిడివి మరో 14నిమిషాలు పెంచుతున్నారట. ఇప్పటికే ఈ సినిమా దాదాపు మూడు గంటల రన్ టైమ్‌తో ప్రదర్శితం అవగా.. ఇప్పుడు మరో పావుగంట యాడ్ కానుంది. కొందరి నుంచి లెంగ్త్ ఎక్కువైందని వాదనలు వినిపించినప్పటికి.. చాలా మంది అదసలు సమస్యే కాదని.. ఇంకో అరగంట ఉన్న సినిమా చూసేవాళ్లమని వెల్లడించారు.సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అసలు స్టార్ కాస్ట్ లేదు. పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడక్షన్ సంస్థ అంత కన్నా కాదు. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీశారు. ఇప్పుడా నమ్మకమే కోట్లు కుమ్మరిస్తుంది.
హిట్ నుంచి డబుల్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే బయ్యర్లకు కళ్లు చెదిరే లాభాలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు సైతం ఆ రేంజ్‌లో లాభాలు తీసుకురాలేదని పలువురు డిస్ట్రిబ్యూటర్లు తెగేసి చెబుతున్నారు. మరో వైపు ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం కూడా చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు మెుదటి వారంలోనే ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ సినిమా విడుదలయ్యాక.. వస్తున్న టాక్ తో ఈ తేదీని కాస్త వాయిదా వేశారు. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మెుదటి వారంలో ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఆహా ఓటీటీలోనే బేబీ సినిమా స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. ఇంకా థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మరికొన్ని రోజులు ఓటీటీ విడుదలను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.