Baby : వైష్ణవి చైతన్య ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోన్న పేరు. ముఖ్యంగా బేబి సినిమాను చూసిన జనాలు ఈ అమ్మడి నటనకు ఫిదా అవుతున్నారు. హీరోయిన్‌గా మొదటి సినిమాలోనే ఈ రేంజ్‌లో తన నటనతో వావ్ అనిపించిందని.. భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతోందని కామెంట్స్ చేస్తున్నారు. చెప్పాలంటే బేబి సినిమాకు వచ్చిన ఈ క్రేజ్ అంతా వైష్ణవి వల్లే, ఈ సినిమాను తన భుజాలపై మోసిందని అనే వారు ఉన్నారు. ఎందుకంటే ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తన పాటలతో పాటు, టిక్ టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఈ హైదరాబాదీ. ఇక ఆమెకు యూత్‌లో ఉన్న క్రేజ్‌ను దర్శకుడు సాయి రాజేష్ తెలివిగా ఉపయోగించుకున్నాడు. బేబి సినిమాతో బంపర్ హిట్ కొట్టాడని అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర 70 కోట్లకు పైగా గ్రాస్ సాధించి వావ్ అనిపించింది. దీంతో తాజాగా టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్‌ను జరిపింది. ఈ ఈవెంట్‌కు చిరంజీవి చీప్ గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా వైష్ణవి మాట్లాడుతూ.. చిరంజీవి సార్.. మీరు యాక్టింగ్ గాడ్.. మీరు ఎంతో ఇన్సిపిరేషన్.. అంటూ మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు రామ్ లేటెస్ట్ సినిమా డబుల్ ఇస్మార్ట్‌లో వైష్ణవికి ఓ మంచి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమెకు హీరోయిన్ అవకాశం ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఆమె బేబి తర్వాత తన తదుపరి చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్‌లో చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది.

ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. చిన్న సినిమాగా వచ్చిన ఈ బేబీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబట్టే ఆస్కారం ఉంది. విడుదలకు ముందే సాలిడ్ బజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఫస్ట్ డే అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ డే నుంచి ఆఫీస్ దగ్గర ఊఛకోత కోసింది. అంతేకాదు మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి వావ్ అనిపించింది.