Baby Movie కంటెంట్ బాగుంటే హీరో ఎవరు ఏమిటి అనేది చూడరు, ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టేస్తారు, అద్భుతమైన విజయాన్ని చేతిలో పెడుతారు అనే దానికి ఈమధ్య కాలం లో చాలా ఉదహారణలు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా ‘బేబీ’ చిత్రం మరో ఉదాహరణగా నిల్చింది. ‘కలర్ ఫోటో’ చిత్ర నిర్మాత సాయి రాజేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందు నుండే టీజర్ , ట్రైలర్ మరియు ఇతర ప్రమోషనల్ కంటెంట్ తో మూవీ పై అంచనాలను భారీ గా పెంచేలా చేసాయి.
విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా అద్భుతంగా జరిగాయి. ఇక విడుదలైన మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ రావడం తో ఓపెనింగ్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చాయి. కేవలం మొదటి రోజు మాత్రమే కాదు, రెండవ రోజు కూడా ఈ చిత్రానికి ఉదయం ఆటల నుండే అద్భుతమైన ఆక్యుపెన్సీలు దక్కాయి.
అయితే ఈ రెండు రోజులకు కలిపి ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకు 2 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబడితే, రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువగా 2 కోట్ల 98 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అలా కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల 58 లక్షల రూపాయిలు షేర్ వసూళ్లు వచ్చాయి.
అలాగే కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 26 లక్షల రూపాయిలు, ఓవర్సీస్ లో కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బేబీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 7 కోట్ల 40 లక్షల రూపాయలకు జరిగిందిరెండు రోజుల్లోనే 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా, నేటితో బ్రేక్ ఈవెన్ మార్కు ని దాటనుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిలబడబోతుందో చూడాలి.