Vaishnavi : రీసెంట్ గా సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన కామన్ గా వినిపిస్తున్న పేరు వైష్ణవి చైతన్య. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ మరియు కవర్ సాంగ్స్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య , ఆ తర్వాత ప్రముఖ జస్వంత్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి చేసిన ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ తో లైం లైట్ లోకి వచ్చింది. ఈ సిరీస్ ద్వారా ఆమెకి వచ్చిన క్రేజ్ మామూలుది కాదు.

ఈ క్రేజ్ తో ఆమెకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కానీ, అవి కేవలం చిన్న చిన్న పాత్రలు మాత్రమే. అలా సాగుతున్న ఆమె కెరీర్ కి రీసెంట్ గా విడుదలైన ‘బేబీ’ చిత్రం ఇచ్చిన బూస్ట్ మామూలుది కాదు. ఇన్నాళ్లు ఆమె ఇండస్ట్రీ లో పేరు సంపాదించుకోవడం కోసం పడిన కష్టాలన్నిటికీ తగిన ఫలితం ఈ సినిమాతో దక్కింది. ఈ చిత్రం తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన వైష్ణవి చైతన్య కి నితీష్ చైతన్య అనే తమ్ముడు కూడా ఉన్నాడు.

ఇతను కూడా రీసెంట్ గానే ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టాడు. ఇతనిని చూసిన ప్రతీ ఒక్కరు షాక్ కి గురి అయ్యారు. టాలీవుడ్ లో చాలా మంది మీడియం రేంజ్ హీరోలకంటే కూడా అద్భుతమైన లుక్స్ తో మిల్కీ బాయ్ లాగ ఉన్నాడు. ఇతను వైష్ణవి చైతన్య తో కలిసి దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చెయ్యగా, అవి తెగ వైరల్ గా మారాయి. ప్రతీ ఒక్కరు ఆ ఫోటోలను చూడగానే హీరో లాగ ఉన్నావ్, సినిమాల్లోకి ఎప్పుడు వస్తావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే వైష్ణవి చైతన్య లకి యాతన తమ్ముడు నితీష్ అంటే ఎంతో ఇష్టం. అతని మీద ఈగ కూడా వాలకుండా చూసుకునేది అట చిన్నప్పటి నుండి. తన తమ్ముడిని ఎవరైనా కామెంట్ చేసినా , ఎవరైనా తిట్టినా కొట్టినా పెద్ద గొడవలకు వెళ్లిపోయేదట. తన తమ్ముడు అంటే అంత ఇష్టమని, అతనికి మించి నాకు ఈ ప్రపంచం లో ఏది ముఖ్యం కాదు అంటూ వైష్ణవి చైతన్య గతం లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.