మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన ఇద్దరు తల్లితండ్రులు కాబోతున్నారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్నీ తెలియచేసాడు. ఎంతో కాలం నుండి ఈ శుభవార్త కోసం ఎదురు చూస్తున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఈ వార్త విన్నాక వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. వీళ్లిద్దరికీ పెళ్ళై పదేళ్లు దాటింది. కానీ పిల్లలు లేకపోవడం తో సోషల్ మీడియా లో అనేక నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.

ఉపాసన కూడా ఏ ఇంటర్వ్యూ కి వెళ్లినా దీని గురించే అడిగేవారు. కెరీర్ పరంగా ఇద్దరం చాలా బిజీ గా ఉన్నామని, మాకు సమయం వచ్చినప్పుడు ప్లాన్ చేస్తాం అంటూ చెప్పుకొచ్చేది ఉపాసన. అలా పదేళ్లు గడిచిన తర్వాత వీళ్లిద్దరు చివరికి తల్లితండ్రులు కాబోతున్నారు. ఇది ఇలా ఉండగా కాసేపటి నుండి సోషల్ మీడియా లో ఒక వార్త అభిమానులను సంబరాలు చేసుకునేలా చేస్తుంది.

అదేమిటంటే రేపే ఉపాసన బిడ్డకి డెలివరీ ఇవ్వబోతుందని, ప్రస్తుతం ఆమెని అపోలో హాస్పిటల్ లో చేర్చి గైనకాలజిస్ట్స్ అబ్సెర్వేషన్ లో పెట్టారని , బిడ్డని ఆరోగ్యంగా సురక్షితంగా ఉంచేందుకు అన్నీ విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తుంది. రామ్ చరణ్ కూడా గత రెండు రోజుల నుండి అపోలో హాస్పిటల్ లోనే మకాం వేసాడట.

హాస్పిటల్ లో ఒక ఫ్లోర్ మొత్తాన్ని బ్లాక్ చేసారు, రామ్ చరణ్ కి మినహా ఎవరికీ లోపలకు వచ్చే అనుమతి లేకపోవడం కారణం గా, దగ్గరుండీ అన్నీ ఆయనే చూసుకుంటున్నాడని తెలుస్తుంది. మరి ఇప్పటి నుండే సోషల్ మీడియా లో అభిమానులు వారసుడు వస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ కి మగబిడ్డ పుట్టబోతున్నాడని చెప్తున్నారు, ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కానీ , సోషల్ మీడియా లో మాత్రం ఈ వార్త విస్తృతంగా ప్రచారం అవుతుంది.