ప్రభాస్ కు కూడా గురువు రాకేష్ మాస్టరే.. కన్నీళ్లు ఆగడం లేదు..

- Advertisement -

టాలీవుడ్ కొరియోగ్రఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ కన్నుమూశారు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు అవ్వడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు కుటుంబసభ్యులు. ఇక అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

రాకేష్ మాస్టర్
రాకేష్ మాస్టర్

ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ కి సంబంధించిన ఒక పాత ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎంతో గొప్ప స్టార్‌డమ్ ని అందుకున్న ప్రభాస్ కి కెరీర్ మొదటిలో రాకేష్ మాస్టర్ డాన్స్ పాఠాలు నేర్పించాడు. అలా డాన్స్ నేర్పిస్తున్న ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఫోటోని షేర్ చేస్తూ అభిమానులు ఆయనని గుర్తు చేసుకుంటున్నారు.

కాగా, రాకేష్ మాస్టర్ మృతిపై ఆయన అసిస్టెంట్ సాజిద్ స్పందించారు. రాకేష్ మాస్టర్ బతకడం కష్టమని రెండు నెలల క్రితమే డాక్టర్లు చెప్పారని సాజిద్ వెల్లడించారు. తాను రాకేష్ మాస్టర్‌కు ఎడిటర్‌గా పనిచేశానని.. తనపై నమ్మకంతో ప్రతి విషయానికి తననే పిలుస్తారని సాజిద్ చెప్పారు. ‘హనుమాన్’ సినిమా క్లైమాక్స్ షూటింగ్‌లో పాల్గొన్న రాకేష్ మాస్టర్.. ఆ సమయంలోనే రక్తపు విరోచనాలు, వాంతులు చేసుకున్నారని సాజిద్ వెల్లడించారు. అప్పుడు తానే హాస్పిటల్‌కు తీసుకెళ్లానని.. పరీక్షలు చేసిన వైద్యులు బతకడం కష్టమని, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారని తెలిపారు.

- Advertisement -
rakesh-master

చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రాకేష్ మాస్టర్.. గడిచిన రెండుమూడేళ్లుగా యూట్యూబ్ స్టార్‌గా ఎదిగారు. పలు యూట్యూబ్‌ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎవ్వరికీ భయపడకుండా ఆయన చేసే వ్యాఖ్యలకు చాలా మంది అభిమానులున్నారు.

ఇక ఆయన్ని పిచ్చోడని తిట్టేవాళ్లూ ఉన్నారు. కుటుంబానికి కూడా దూరంగా ఉంటున్న రాకేష్ మాస్టర్.. అబ్దుల్లా‌పూర్ మెట్‌లో ఓ అనాథ శరణాలయంలో ఉంటున్నారు. ఆ అనాథ శరణాలయం నడుపుతున్న ఆలేటి ఆటమ్.. రాకేష్ మాస్టర్‌కు ఆశ్రయం ఇచ్చారు. ఆలేటి ఆటమ్‌ను రాకేష్ మాస్టర్ అన్నయ్య అని పిలుస్తారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here