బాబు మోహన్.. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకానొక టాప్ కమెడియన్‍గా వెలుగొందారు. వందలాది సినిమాల్లో నటించారు. తన వైవిధ్యమైన నటన, హావభావాలు, కామెడీ టైమింగ్‍తో తెగ నవ్వించేశారు. ఆ తర్వాత క్రమంగా సినిమాలు తగ్గించి రాజకీయాలవైపు వెళ్లారు. ప్రస్తుతం రాజకీయాల్లోనూ బాబు మోహన్ అంత క్రియాశీలకంగా లేరు. అయితే, ప్రస్తుతం ఓ టీవీ షోలో ఆయన న్యాయనిర్ణేత (జడ్జి)గా వ్యవహరిస్తున్నారు.
ఆ షోలో ఓ ఎపిసోడ్‍లో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. తన చిన్ననాటి పరిస్థితిని తలుచుకొని భావోద్వేగానికి లోనయ్యారు.జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ప్రసారమవుతున్న ‘డ్రామా జూనియర్స్ 6’ షోకు బాబు మోహన్ జడ్జిగా ఉన్నారు. ఈ షోకు సంబంధించిన 8వ ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. అయితే, పిల్లలు ఓ స్కిట్ చేసిన తర్వాత బాబు మోహన్ భావోద్వేగానికి గురయ్యారు. తన చిన్ననాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. తాను మూడో తరగతి చదువుతున్నప్పుడు తల్లి చనిపోయారని, తండ్రి తమను విడిచివెళ్లారని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.
“నాకు మా అమ్మ గుర్తొచ్చింది. మూడో తరగతిలో మా అమ్మ చనిపోయింది. నాకు చిన్న చెల్లెలు ఉంది. నేను చిన్నప్పటి నుంచి తలదువ్వి.. జడ వేశా. మా నాన్న ఎటో వెళ్లిపోయాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు” అని చెబుతూ బాబు మోహన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. భావోద్వేగానికి లోనయ్యారు. డ్రామా జూనియర్స్ 8వ ఎపిసోడ్ ఆగస్టు 13న ప్రసారం కానుంది. డ్రామా జూనియర్స్ 6వ సీజన్ జీ తెలుగులో ప్రతీ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతోంది. ఈ షోలో పిల్లలు.. స్కిట్స్ చేస్తారు. ఈ కార్యక్రమానికి జయప్రద, బాబుమోహన్, శ్రీదేవి జడ్జిలుగా ఉన్నారు. ప్రదీప్ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు.