Ayesha Khan : హద్దు మీరుతున్నారు.. ఫోటోగ్రాఫ‌ర్లపై అయేషా ఖాన్ ఫైర్‌

- Advertisement -

Ayesha Khan : బిగ్ బాస్ (హిందీ) బ్యూటీ అయేషా ఖాన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో మోటా.. పాటతో అదరగొట్టబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో దిమ్మతిరిగే గ్లామర్ తో మనసులు కొల్లగొట్టేందుకు ఈ బ్యూటీ సిద్దమైంది. ఇటీవల విడుదలైన మోటా లిరికల్ వీడియోలో అయేషా గ్లామర్ షో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయేషా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మేలో విడుదల అయ్యేందుకు డేట్‌ ఫిక్స్‌ చేశారు ఫిలిం మేకర్స్‌. ఇటీవల విడుదలైన “ఓం భీమ్ బుష్` సినిమాలో కూడా ఈ బ్యూటీ నటించింది. ఈ రెండు సినిమాలతో అయేషా తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పుడు ఈ బ్యూటీ పబ్లిక్ ఈవెంట్‌లలో ఫోటోగ్రాఫర్‌ల అసహ్యకరమైన ప్రవర్తనపై దుమ్మెత్తిపోయడం చర్చనీయాంశంగా మారింది. ఫోటోగ్రాఫర్ల పట్ల తీవ్రంగా మండిపడ్డింది. ఫోటో గ్రాఫర్లు దురుసుగా ప్రవర్తించారంటూ అయేషా చేసిన ఆరోపణలు ఇప్పుడు పెద్ద షాక్‌గా మారాయి.  ఫోటోగ్రాఫర్లు హద్దు మీరి ప్రముఖుల చిత్రాలను, అనుమతి లేకుండా, కనీస మర్యాద లేకుండా తీశారని ఆరోపిస్తున్నారు అయేషా. బాలీవుడ్‌లో తనకు జరిగిన అగౌరవంపై అయేషా మండిపడింది. ఇండస్ట్రీలో మహిళా నటీమణులు ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేసింది. ఇప్పుడు అయేషా  స్టిల్ ఫోటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి ప్రవర్తనతో తనకు విసుగు చెందానని వివరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్టులతో విరుచుకుపడింది ఈ బ్యూటీ.

- Advertisement -

అనుమతి లేకుండా ఫోటోలు తీయడమే కాకుండా.. ప్రాథమిక మర్యాద లేకపోవడాన్ని ప్రశ్నించింది. మహిళల పట్ల వారికి అనుమతి లేకుండా.. కొన్ని ప్రదేశాల్లో ఫోటోలు తీయడం చాలా తప్పు అంటూ ప్రస్తావించింది. ఎవరైనా ప్రశ్నిస్తే.. మీరు అలాంటి డ్రస్సులు వేసుకుంటారు అను ఇంకా తప్పు అంటూ పేర్కొంది. ఎవరైన సరే వారికి నచ్చిన దుస్తులు వేసుకోవచ్చని, అంతే కానీ కొన్ని ప్రదేశాల్లో ఫోటోలు తీసి దాన్ని మాత్రమే హైలెట్ చేయడం సబబు కాదని తెలిపింది. మీడియా సంస్థలు కొన్ని ప్రాథమిక మర్యాదలు నేర్చుకోవాలని సూచించింది. మీడియా నుంచి గౌరవం కోరే సెలబ్రిటీల సరసన అయేషా వాయిస్ చేరిపోయింది. తెరపై, తెర వెనుక నటీమణులు ఎదుర్కొంటున్న నిరంతర ఒత్తిడిని ఆయేషా స్పష్టంగా వివరించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here