ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన ‘ఆది పురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది. చిన జీయర్ స్వామి స్పెషల్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుకలో ప్రభాస్ గురించి కృతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన గురించి అందరూ అనుకుంటున్నది నిజం కాదని చెప్పారు. అలాగే ప్రభాస్ ను దారుణంగా అవమానించిందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా ఆది పురుషుడు ప్రభాస్కి సంబంధించిన వార్తలే వైరల్ అవుతున్నాయి. జూన్ 16న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై జనాలు భారీ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫైనల్ ట్రైలర్ కూడా సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది . అయితే ఈ స్టేజిపై ప్రభాస్ మాట్లాడుతూ ఉండగా కృతి సనన్ ఆయనని పట్టించుకోకుండా వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రోగ్రాం ముగించే ముందు ప్రభాస్ స్టేజిపై మైక్ పట్టుకొని మాట్లాడాడు .

“సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం ..సినిమా నటునటునందుకు థాంక్స్ చెప్తూ స్పీచ్ లు కంటిన్యూ చేశాడు “. అయితే ఈ సినిమాలో సీత రోల్ చేసిన కృతి సనన్ గురించి స్టేజిపై మాట్లాడుతూ ..”కృతి సనన్ ని ..ఆమె ఎక్స్ప్రెషన్స్ నీ పొగిడేశారు. అయితే ప్రభాస్ పొగుడుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా..స్టేజీ పై ఆ వేడికి ఆ ఉడకకి కృతి వెళ్ళిపోయింది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . ప్రభాస్ ఫ్యాన్స్ దీనిపై మండిపడుతున్నారు. అన్ని కోట్లు ఖర్చు చేసి ఈవెంట్ పెడితే కనీసం గంట కూడా స్టేజిపై ఉండలేవా..? అంత వయ్యారంగా పెరిగావా..?అంటూ మండిపడుతున్నారు .