Priyanka Chopra : ముఖం నిండా తీవ్ర గాయాలతో ప్రియాంక చోప్రా.. ఆందోళనలో ఫ్యాన్స్

- Advertisement -

Priyanka Chopra : గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన అందం, నటనతో ప్రపంచాన్ని మెప్పించిన మేటి నటి ప్రియాంక చోప్రా. దశాబ్ధం పైగానే బాలీవుడ్‌లో ఆధిపత్యం చెలాయించడమే కాకుండా హాలీవుడ్‌లోనూ తన అద్భుతమైన నటనతో తనదైన ముద్ర వేసింది. నటనతో పాటు సామాజిక కార్యక్రమాలతోను ప్రియాంక చోప్రా ఖ్యాతి విశ్వవిఖ్యాతం అయింది. ప్రస్తుతం యునిసెఫ్ గ్లోబల్ అంబాసిడర్ గాను సేవలందిస్తోంది. హాలీవుడ్ కి వెళ్లాక నిర్మాతగా కొత్త అవతారం ఎత్తింది. ఇటీవల కంటెంట్ ఉన్న చిత్రాలతో నిర్మాతగా ఓ వెలుగు వెలుగుతోంది.

Priyanka Chopra
Priyanka Chopra

ఆమె బాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. కెరియర్ పిక్స్ లో ఉండగానే తనకంటే పదేళ్లు చిన్నవాడైన సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుని వివర్శల పాలైంది. ఈ జంటకు ఓ కూతురు ఉంది. అయితే ప్రియాంక చోప్రా పెళ్లై కూతురు పుట్టినప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్లో దూసుకుపోయింది. అలాగే తన కూతురు, భర్తతో నిత్యం వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో సీటాడెల్, బ్లఫ్ అనే సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

Priyanka-Chopra

- Advertisement -

ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఆమెను ఎవరో ముఖం పగిలేటట్లు కొట్టినట్లుగా గాయాలు చూస్తే అర్థమవుతుంది. ఒక కంటి నుండి నీరు కారుతుండడం తో పాటుగా కందిపోయినట్లుగా ఉంది. దీంతో ఈ ఫోటోలు చూసిన ప్రియాంక చోప్రా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ అవి నిజమైన గాయాలు కాదని సమాచారం. ఆమె నటిస్తున్న సినిమాలోని యాక్షన్స్ సీన్స్ కు సంబంధించిన ఫోటోలని టాక్. సినిమాల్లోని సీన్స్ కోసమే ఆ గాయాలను క్రియేట్ చేసినట్లు తెలియడంతో.. ఫ్యాన్స్ రిలీఫ్ అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here