Priyanka Chopra : హాలీవుడ్ ని నమ్ముకొని ఆస్తులు మొత్తం అమ్మేస్తున్న ప్రియాంక చోప్రా.. పాపం ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి!

- Advertisement -

Priyanka Chopra : తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమై ఆ తర్వాత బాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి సూపర్ స్టార్ రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఈమె బాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందం తో పాటుగా అద్భుతమైన యాక్టింగ్ టాలెంట్ ఉన్న ఈమెకి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. అయితే కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే ఈమె హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

Priyanka Chopra
Priyanka Chopra

ఎదో ఒకటి రెండు సినిమాలు చేసుకొని మళ్లీ బాలీవుడ్ కి వచేస్తుందిలే అని అనుకున్నారు ఆమె అభిమానులు. కానీ హాలీవుడ్ లోనే వరుసగా సినిమాలు చేస్తూ అక్కడే స్థిరపడుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. 2015 వ సంవత్సరం లో క్వాన్టికో అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా, ఆ తర్వాత ఆమె హాలీవుడ్ లో లేడీ విలన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించింది. ఇప్పటికీ నటిస్తూనే ఉంది.

Priyanka Chopra Photos

అయితే ఈమె ఇక శాశ్వతంగా హాలీవుడ్ లోనే స్థిరపడేందుకు ఇండియా లో ఇప్పటి వరకు ఆమె ఏర్పర్చుకున్న ఆస్తులను మొత్తం అమ్మేయడానికి సిద్దపడింది. రీసెంట్ గానే ఒక బిడ్డకి జన్మనిచ్చిన ప్రియాంక చోప్రా, ఇక అమెరికాలోనే స్థిరపడిపోవాలని నిర్ణయం తీసుకుంది. అందుకే ఇండియా లో ఇన్నేళ్లు కస్టపడి సంపాదించిన ఆస్తి మొత్తాన్ని అమ్మేస్తున్నట్టుగా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

- Advertisement -

రీసెంట్ గానే ఈమె అంధేరి లో ఉన్న తన రెండు పెంట్ హౌస్ లను ప్రముఖ సినీ నిర్మాత అభిషేక్ చౌబే కి ఆరు కోట్ల రూపాయలకు అమ్మేసింది. ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద చర్చకి దారి తీసింది. ఇక మీదట అయినా ప్రియాంక చోప్రా ని బాలీవుడ్ సినిమాలలో చూస్తామేమో అని ఆశతో ఎదురు చూస్తున్న ఆమె అభిమానులకు,ఇక ఎప్పటికీ ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టదు అనే విషయం ఈ సంఘటన తో అర్థమై నిరాశని వ్యక్తపరుస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here