Big Boss : వామ్మో.. 8 వారాల కోసం సందీప్ కు బిగ్ బాస్ ఇంత రెమ్యునరేషన్ ఇచ్చాడా!

- Advertisement -

Big Boss : ఎనిమిది వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్లో ఎనిమిదో వారంకు గాను ఆట ఫెమ్ సందీప్ ఎలిమినేట్ అయ్యాడు.. మొదటి నుంచి సందీప్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటున్నాడు.. ఇక 8వ వారానికి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. అమర్ దీప్, శివాజీ, అశ్విని, భోలే, ప్రియాంక, శోభ, గౌతమ్, సందీప్ బయటకు వెళ్లేందుకు నామినేట్ చేయబడ్డారు. సందీప్ గత ఎనిమిది వారాల్లో మొదటిసారి నామినేట్ అయ్యాడు. సందీప్ పవర్ అస్త్ర గెలిచిన సందీప్ కి 5 వారాల ఇమ్యూనిటీ దక్కింది.

Big Boss
Big Boss

ఆరో వారం నామినేట్ కాగా… గౌతమ్ తనకు బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ తో నామినేషన్స్ నుండి తప్పించాడు.. శివాజీ అందరికంటే అత్యధిక ఓట్లు సంపాదించగా… డేంజర్ జోన్లో సందీప్, శోభ ఉన్నారని తెలిసింది. శోభా కంటే సందీప్ స్వల్ప ఓటింగ్ తో ముందున్నాడు. కాబట్టి శోభ ఎలిమినేట్ అవుతుందని ప్రచారం జరిగింది. అనూహ్యంగా సందీప్ పేరు తెరపైకి వచ్చింది. గౌతమ్, ప్రియాంక, అమర్ దీప్, అశ్విని, శివాజీ, భోలే సేఫ్ అయ్యారు. సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. అందరు శోభా ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు కానీ ఊహించని విధంగా సందీప్ ఎలిమినేటైనట్లు నాగార్జున ప్రకటించారు. తేజ, శోభ చాలా బాధపడ్డారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.

కాగా 8 వారాలకు సందీప్ గట్టిగానే రెమ్యూనరేషన్ తీసుకున్నాడని సమాచారం. సందీప్ వారానికి రూ. 2.5 లక్షలు ఒప్పందంతో హౌస్లో అడుగుపెట్టాడని మొదట్లో వార్తలు బాగానే వినిపించాయి. దాంతో అతను ఎనిమిది వారాలకు గాను రూ. 20 లక్షలు రెమ్యూనరేషన్ గా అందుకున్నాడని సమాచారం.. అతని పేరుకు తగ్గట్లే గట్టిగానే తీసుకున్నాడని టాక్.. ఇక ఈ వారం అమర్ బయటకు వెళ్తారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. ఏం అవుతుందో, ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here