Venu Swamy : ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి సెలబ్రిటీల జ్యోతిష్యం గురించి వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. టాప్ హీరోల జాతకం కూడా చెబుతూ అప్పుడప్పుడు వారి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతుంటారు. ఇక సోషల్ మీడియాలో ఈయనకు మహా ఫాలోయింగ్ ఉంది. కేవలం జాతకాలు మాత్రమే కాదు ఈయన రీల్స్ చేస్తూ తన అభిమానులకు షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఆయన రీల్స్ పై నెటిజన్లు కొన్నిసార్లు డర్టీ కామెంట్స్ పెడితే.. మరికొన్ని సార్లు మాస్ ర్యాగింగ్ చేస్తుంటారు. వారందరికీ వేణుస్వామి తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటారు.

తాజాగా ఆయన తన భార్య వీణ ఘంటసాలతో కలిసి ఓ రీల్ చేశారు. ఆ రీల్ ను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి సోషల్ మీడియా టేక్ ఏ బ్రేక్ (ఊపిరి పీల్చుకో) అంటూ క్యూట్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ రీల్ లో వేణు స్వామి మరో అమ్మాయి ఓ టేబుల్ వద్ద ఛైర్ లో కూర్చొని ఉండగా, ఆయన భార్య వీణ పక్కన నిల్చొని కనిపించారు. ఇక ఈ వీడియోలో వీరిద్దరూ కింగ్ నాగార్జున ఫేమస్ మూవీ మన్మథుడులోని ఫేమస్ డైలాగ్ చెప్పారు.
వేణు పక్కన కూర్చున్న అమ్మాయి ఒక డౌట్ అని నాగార్జున డైలాగ్ చెప్పగా.. వేణుస్వామి ఇంకెందుకు లేటు అడుగూ అంటూ అన్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయి మీది లవ్ మ్యారేజ్ కదా.. ముందు ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా మీరు ఆవిడను ప్రేమించారా అని అడిగింది. దానికి వేణు స్వామి తన భార్య వీణ వైపు చూస్తూ ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అని అన్నారు. దానికి వీణ వేణు వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లింది.
ఈ రీల్ చూసి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎంతైనా వేణు గారు మహానుభావులు అంటూ కొందరు, ఆయనలో ఏదో తెలియని శక్తి ఉంది మాస్టారు అంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ రీల్ ఇన్ స్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ రీల్ కింద హార్ట్ ఎమోజీలు పోస్టు చేస్తూ తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. వేణు స్వామిలో ఈ యాంగిల్ మనమెప్పుడూ చూడలేదే అంటూ కొందరు కొంటెగా కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram