Ashu Reddy : అక్కడ ఛాన్స్ కొట్టేసిన బోల్డ్ బ్యూటీ అష్షూ రెడ్డి.. వర్మ తో అలా చేస్తూ

- Advertisement -

Ashu Reddy : బోల్డ్ బ్యూటీ అష్షూ రెడ్డి ఎట్టకేలకు లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఈ బ్యూటీ బోల్డ్ నెస్, స్కిన్ షో, గ్లామర్ ట్రీట్ ఎట్టకేలకు ఫలించింది. టాలీవుడ్ లో ఓ సినిమా ఆఫర్ వచ్చేసింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ బ్యూటీ చివరకు తను అనుకున్నది సాధించింది. ఇప్పటి దాకా సోషల్ మీడియాలోనే తన అందాలు ఆరబోసిన అష్షూ రెడ్డి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై తన బ్యూటీ ట్రీట్ తో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేయబోతోంది.

Ashu Reddy
Ashu Reddy

జూనియర్ సమంతగా అష్షూ రెడ్డి చాలా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బిగ్ బాస్ షో, చిన్న చిన్న షోలు చేసింది. ఇక రామ్ గోపాల్ వర్మ చేతిలో పడ్డాక అష్షూ దశే తిరిగిపోయింది. ఆర్జీవీ తో కలిసి అష్షూ చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలు.. ఆ ఇంటర్వ్యూలలో ఈ బ్యూటీ స్కిన్ షో తో అష్షూ చాలా ఫేమస్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ బోల్డ్ నెస్ కు హద్దు లేకుండా పోయింది. 

Ashu Reddy and Arvind Krishna

వెండితెర ప్రయత్నాల్లో భాగంగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. హద్దులు చేరిపేసే అందాలతో సోషల్ మీడియాలో  ఫాలోయింగ్ పెంచుకుని సిల్వర్ స్క్రీన్ వరకూ రీచ్ అవ్వాలని ప్లాన్ చేసింది. ఇక ఎట్టకేలకు అనుకుంది సాధించింది అష్షూ రెడ్డి. ఓ యంగ్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.

- Advertisement -

యంగ్ హీరో అరవింద్ కృష్ణ రీసెంట్ గా ఓ న్యూ మూవీ స్టార్ట్ చేశాడు.  ఏ మాస్టర్ పీస్‌  టైటిల్ తో సిల్వర్ స్క్రీన్‌పై ఇది వరకెన్నడూ చూడని కొత్త తెలుగు సూపర్ హీరోగా అరవింద్‌ కృష్ణ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.  పూర్వజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అష్షూ రెడ్డిని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఏ మాస్ట‌ర్ పీస్ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో ఆద్య అనే పాత్ర‌లో అష్షూ రెడ్డి క‌నిపించ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. యాక్టింగ్‌తో పాటు గ్లామ‌ర్‌కు స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో అష్షూ రెడ్డి కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు తుదిద‌శ‌కు చేరుకున్న‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లు పెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం. నితిన్ హీరోగా న‌టించిన ఛ‌ల్ మోహ‌న‌రంగ సినిమాతో ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ మీద మెరిసింది అష్షూ రెడ్డి. 

బిగ్‌బాస్ సీజ‌న్ సీజన్ 3 తో పాటు ఓటీటీ బిగ్ బాస్ లో కూడా సందడి చేసింది బ్యూటీ. కానీ రెండింటిలో ఫైనల్స్ వరకూ వెళ్లలేక పోయింది.  ఇక రామ్‌గోపాల్‌వ‌ర్మ‌తో చేసిన ఇంట‌ర్వ్యూల ద్వారా ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా పాపుల‌ర్ అయ్యింది అష్షూ రెడ్డి. రీసెంట్ గా ఆమె పాదాలు ముద్దాడుతూ.. వర్మ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆ టాపిక్ హీట్ ఇంకా తగ్గలేదు కూడా.  ఇన్ స్టా రీల్స్, ఇంటర్వ్యూలు, పలు షోలతో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అష్షూ రెడ్డి.. చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై  హీరోయిన్ గా కనిపించనుండటంతో ఆమె ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here