ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి ఇటీవల రెండో పెళ్లి చేసుకోవడం అందర్నీ షాక్ కి గురి చేసింది. 60 ఏళ్ల వయసులో ఉన్న ఆశిష్.. అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలీ బారువాను మే 25న వివాహం చేసుకున్నాడు. ఈయన ప్రముఖ నటి శకుంతల బారువా కూతురు పిలూ విద్యార్థి అలియాస్ రాజోషి విద్యార్థి 2001 లో పెళ్లి చేసుకున్నారు. 22 ఏళ్ళ పాటు అన్యోనంగా ఉన్న వీరిద్దరికి అర్త్ విద్యార్థి అనే కుమారుడు కూడా ఉన్నాడు.

“అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. 22 ఏళ్ల క్రితం పీలోను నేను వివాహం చేసుకున్నాను. మా బంధం అద్భుతంగా సాగింది. మాకు అర్ధ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే గత రెండేళ్లుగా మా మధ్య జరిగిన సంఘటనలను గుర్చించి చర్చించుకున్నాం. భవిష్యత్తులో ఇద్దరం ఒకరికొకరం విభిన్నంగా ఉంటామని అర్థమైంది. మా మధ్య ఉన్న వ్యత్యాసాలను తగ్గించుకోవాలని ప్రయత్నించాం. కానీ కుదరలేదు. మా మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఆనందాన్ని దూరం చేస్తుంది. మనకు కావాల్సిందే సంతోషమే కదా? కాబట్టి మేము కూర్చొని మాట్లాడుకుని ఫరస్పర అంగీకారంతో విడిపోయాం. అలాగే స్నేహాపూర్వకంగా ఉండాలని అనుకున్నాం” అని అన్నారు.

అలాగే రూపాని గురించి మాట్లాడుతూ..‘‘ నేను తను రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం. నా భార్యతో విడిపోయాక ఒక్కడినే ఉండలేక పోయాను. అందుకే రెండేళ్లకే తనను పెళ్లి చేసుకున్నాను. నేను రూపాని చాటింగ్ చేసుకున్నాం. ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నాం. ఒకరిని విడిచి ఒకరం ఉండలేకపోయామనుకున్నాం. అందుకే ఒక్కటయ్యాం. నాకు ప్రపంచం చూడాలని ఉంది. నాకు ఇష్టమైన వాళ్లతో కలిసి ప్రంపంచాన్ని చూస్తాను’’ అని ఆశిష్ విద్యార్థి తెలిపారు.