నా మొగుడు వెకేషన్ లో చేసిన పని వల్లే నేను లావయ్యాను.. తగ్గడానికి తంటాలు పడుతున్న అనసూయ

- Advertisement -

గత నాలుగు రోజులుగా అనసూయ భరద్వాజ్ తన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కావడంతో భర్త భరద్వాజ్, పిల్లలిద్దరితో కలిసి ఈ సమ్మర్ వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తుంది అనసూయ. ఆ వెకేషన్స్ లో స్విమ్ చేసినా, బ్రేక్ ఫాస్ట్ తిన్నా, సాయంత్రం వేళలో నదీ తీరాన స్పెండ్ చేస్తున్నా ఆ ఫొటోస్ ని షేర్ చేస్తుంది. తాజాగా ఓ వీడియో షేర్ చేసిన అనసూయ.. వెకేషన్ లో వాళ్ల ఆయన తను వద్దు అని చెప్పినా ఎక్కువ ఫుడ్ తినిపించారట. అందుకే తెగ లావైందట. ఈ విషయాన్ని అనసూయనే చెప్పింది.

అనసూయ
అనసూయ

ఇక గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడి అనే విషయం అందరికీ తెలిసిందే. అది ఉన్నంత కాలమే డిమాండ్ ఉంటుంది. పొరపాటున షేప్ అవుట్ అయితే పట్టించుకునే నాథుడు ఉండదు. ఈ విషయం అనసూయకు బాగా తెలుసు. అందుకే ఆమె ఫిట్నెస్ అండ్ బ్యూటీ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. సహజంగానే అనసూయ కొంచెం బొద్దుగా ఉంటుంది. ఇకపై లావు కాకుండా ఆమె చూసుకుంటారు.

ఆమె పెద్ద కొడుకు బర్త్ డే కాగా ఓ వారం రోజులు విహారానికి చెక్కేశారు. వెకేషన్ అంటే బయట ఫుడ్ తినాల్సిందే. ఇక పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడిగినవి తినిపించాలి. మనం కూడా తినాలి. అనసూయ కూడా వెకేషన్ అనేక రుచికరమైన వంటలు లాగించేశారట. దాంతో బరువు పెరిగిన భావన కలుగుతుందట. జిమ్ లో కష్టపడుతున్న వీడియో పోస్ట్ చేసిన అనసూయ డిషెస్ తినకుండా ఉండాల్సింది అంటూ కామెంట్ పెట్టింది. అతిగా తిన్నందుకు ఇప్పుడు కరిగించాల్సి వస్తుందని ఆమె పశ్చాతాపం చెందుతున్నారు. అనసూయ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. నెటిజెన్స్ డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here