Arjun Ambati : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టి, చాలా కూల్ గా టాస్కులు ఆడుతూ, అశేష ప్రేక్షకాదరణ పొందిన కంటెస్టెంట్ అర్జున్ అంబటి. సీరియల్ హీరో గా మంచి గుర్తింపు దక్కించుకున్న అర్జున్, పలు సినిమాల్లో హీరో గా కూడా చేసాడు. బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన అర్జున్, బిగ్ బాస్ షో ద్వారా మరింత దగ్గరయ్యాడు. అయితే ఆయన ప్రతీ విషయం లో చాలా కూల్ గా ఉండడం చూస్తుంటే, మాస్కు వేసుకున్నాడు అనే విషయం అర్థం అవుతుంది.

అంతే కాకుండా బయట అమర్ దీప్ తో మంచి స్నేహం చేస్తూ ఉండే అర్జున్, హౌస్ లో మాత్రం అతన్ని తొక్కే విధంగా ప్రవర్తించడం కూడా, ప్రేక్షకుల్లో అర్జున్ అంబటి పై కాస్త నెగటివ్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి. ఇవి రెండు పక్కన పెట్టి, పూర్తి స్థాయిలో మాస్కుని తొలగిస్తే అర్జున్ అంబటి కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తారని అంటున్నారు.

ఇదంతా పక్కన పెడితే అర్జున్ అంబటి కి బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే అద్భుతమైన అవకాశం ఒకటి దక్కింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు బుచ్చి బాబు కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అర్జున్ అంబటి కి ఒక మంచి క్యారక్టర్ దక్కింది అట. ఈ విషయాన్ని బుచ్చి బాబు స్వయంగా దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో అర్జున్ కి తెలిపాడు.

బిగ్ బాస్ టైటిల్ గెలిచినా గెలవకపోయినా, కప్ కొట్టినా కొట్టకపోయినా అర్జున్ అంబటి కి బయటకి వచ్చిన తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు ఒక రేంజ్ లో వస్తాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ గా చెప్పుకోవచ్చు. చూడాలి మరి అర్జున్ రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది. టాప్ 5 లోకి అడుగుపెట్టే అర్హతలు మెండుగా ఉన్న అర్జున్ ఇకనైనా మాస్కు తీసి ఆడుతాడో లేదో చూడాలి.