షాకింగ్.. ఆ రోగంతో బాధపడుతున్న అరియానా.. బతుకుతానో లేదో అని పోస్ట్

- Advertisement -

అరియానా బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయి ప్రస్తుతం జనం నోళ్ళలో నానుతోంది అరియానా. పలు వెబ్ సిరీసులు చేస్తూ కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులేస్తున్న ఈ భామ.. అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తుండటం ఆమె అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. స్వయంగా ఓ వీడియో పోస్ట్ చేస్తూ తన అనారోగ్యం గురించి చెప్పింది అరియానా. చేతికి సిరంజి పెట్టుకొని ఓ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన అరియానా.. ఇంకా రికవర్ అవుతూనే ఉన్నా. ఎప్పుడవుతానో ఏంటో? అని చెప్పింది. అయితే తన అనారోగ్య సమస్య ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఈ వీడియో చూసి ఆమె ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు.

అరియానా
అరియానా

క్రమంలోనే ఎప్పుడు హెల్దీ గా బాగుండే అరియానకు ఏమైంది అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . అయితే ఆరియాన వైరల్ ఫ్లూ కారణంగా బాధపడుతుంది అంటూ తెలుస్తుంది. అంతేకాదు రకరకాల డైటింగ్ చేస్తూ జీరో సైజ్ కోసం తాపత్రయపడే అరియానా తన హెల్త్ ని చేతులారా పాడు చేసుకుంటుంది అన్న కామెంట్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కూడా కడుపు మాడ్చుకుని అందంగా ఉండడానికి ఎన్ని రకాల డైటింగ్లు చేస్తున్నారో మనకు తెలిసిందే . త్వరగా అరియాన కోలుకోవాలని అభిమానులు ఆశపడుతున్నారు.

యూట్యూబ్ లో పలు ఛానల్స్ లో హోస్టుగా చేస్తూ తన పేరుని అడపాదడపా పాపులారిటీ చేసుకునేందుకు ట్రై చేసిన అరియానా ఒకసారిగా బిగ్ బాస్ లో ఆఫర్ రావడంతో తన పేరుకి హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . బిగ్ బాస్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అరియానా గేమ్ ని చక్కగా ఆడింది అన్న పేరు ఇప్పటికీ వినిపిస్తుంది . అంతేకాదు ఫైనల్ లో నిలిచి తన స్టామినా ప్రూవ్ చేసుకున్న అరియాన బిగ్ బాస్ తర్వాత ఆర్ జీ వి తో నడిపిన ఇంటర్వ్యూ ఏ రేంజ్ లో హైలైట్ అయిందో మనందరికీ బాగా తెలిసిందే .అంతేనా హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాలో కుర్రాళ్లకు అందాల విందును వడ్డించింది .

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here