Ariyana Glory : యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అరియానా ఆర్జీవి తో చేసిన ఇంటర్వ్యూ తన దశను మార్చేసింది.. ఆర్జీవి చేసిన తొడల కామెంట్లతో అరియానాకు ఒక్కసారిగా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది.. రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ తో అరియానా ఏకంగా బిగ్ బాస్ ఆఫర్ కొట్టేసింది.. బిగ్ బాస్ సీజన్ 4 లో బోల్డ్ బ్యూటీగా అరియానా మంచి క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.. బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేసిన కంటెస్టెంట్స్ ని జోడిగా చేసి బీబీ జోడి అనే డాన్స్ తో మరోసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అలరిస్తున్నారు.. బేబీ జోడిలో అరియానా ముక్కు అవినాష్ తో కలిసి డ్యాన్స్ చేస్తుంది.
వీళ్ళ జంటికి కూడా మంచి మార్కులే పడ్డాయి. బీబీ జోడి లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ తోటి కంటెస్టెంట్స్ కి టఫ్ ఫైట్ ఇస్తున్నారు. గత వారం ముక్కు అవినాష్ థర్డ్ జండర్ ని హైలెట్ చేస్తూ సమాజంలో వారు ఎన్ని బాధలు అవమానాలను అనుభవిస్తున్నారు.. వారిని గుర్తించాలి అంటూ ఓ పాట రూపంలో అద్భుతమైన పర్ఫామెన్స్ తోపాటు మెసేజ్ ఇచ్చారు ముక్కు అవినాష్ అరియానా జోడి..
ఈ జోడి చేసిన పర్ఫామెన్స్ కి సదా ఫుల్ గా ఇంప్రెస్ అయింది. ఏకంగా అవినాష్ కాళ్ళకి దండం పెట్టే వరకు వచ్చింది సదా.. ఇక రాధమ్మ కూడా వీళ్ళిద్దరి డాన్స్ తో పాటు అద్భుతమైన సందేశాన్ని అందరికీ ఇచ్చారని ఈ జంటని ఆకాశానికి ఎత్తేశారు.. ఇక తరుణ్ మాస్టర్ కూడా వీళ్ళని ఓ రేంజ్ లో పొగిడేశారు. తోటి పార్టిసిపెంట్స్ కూడా అవినాష్ అరియానా ను మెచ్చుకున్నారు. కాగా ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసే సమయంలో అరియానా చేతికి గాయం అయిందని తెలిపింది.
నూటికి నూరు శాతం పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం ఇలాంటి చిన్న దెబ్బలు నా పరవాలేదు అంటూ తన చేతికి అయిన గాయాన్ని తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది అరియానా. ఇదంతా ముక్కు అవినాష్ వల్లే జరిగింది అంటూ తెలిపింది. బీబీ జోడి లో మా వంతు ప్రయత్నం చేసి మంచి కామెంట్స్ ఇస్తున్నామని అరియానా తన చేతికి చూపిస్తూ చెప్పింది. కాకపోతే గాయం కాస్త గట్టిగానే తాగింది. అరియానా ని అలా చూసి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.