Rathika Rose : బిగ్ బాస్ హౌస్ నుంచి రతిక ఔట్.. నాలుగు వారాలకు ఎన్ని లక్షలు తీసుకుందంటే?

- Advertisement -

Rathika Rose : అనుకున్నదంతా అయింది బిగ్‌బాస్‌ హౌస్ నుంచి నాలుగో వారంలో రతికా రోజ్ బయటకు వచ్చేసింది. రసవత్తరంగా జరిగిన ఆదివారం నాటి ఎపిసోడ్‌లో రతిక ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. నాలుగో వారం నామినేషన్స్‌లో మొత్తం ఆరుగురు ఉన్నారు. వారిలో చివర వరకు టేస్టీ తేజా, రతికలు మాత్రమే మిగిలారు. అందరూ రతిక టాప్ కంటెస్టెంట్ అనుకున్నారు. కానీ అనూహ్యంగా హౌజ్‌ నుంచి ఆమె ఎలిమినేట్ అయింది. రతికా రోజ్‌ బిగ్ బాస్ షో ఆరంభంలోనే తన అందంతో అందరి చూపును తన వైపునకు తిప్పుకునేలా చేసేసింది. పల్లవి ప్రశాంత్‌తో ప్రేమగా మాట్లాడుతూ జనాల మనసులో స్థానం సంపాదించుకుంది.

Rathika Rose
Rathika Rose

ఇక ఎలిమినేషన్ గురించి మాట్లాడితే.. ఇదంతా ఆమె చేతులరా చేసుకున్నదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే తనకు ఓట్లు తక్కువ వచ్చాయని.. అందుకే నాలుగో వారంలోనే హౌజ్‌ నుంచి బయటకు వచ్చింది. కాగా నాగార్జున యూ ఆర్ ఎలిమినేటెడ్ అని ప్రకటించగానే రతిక ఎమోషనల్‌ అయ్యింది. నేను ఎలిమినేట్ అవ్వడం కలగా ఉందంటూ కన్నీటి పర్వంతం అయింది.

Rathika Rose Bigg Boss

దీనిని బట్టి చూస్తే.. తాను బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని ఎంత గట్టిగా అనుకుందో అర్థం చేసుకోవచ్చు. నాలుగో వారంలోనే హౌస్ నుంచి బయటికి వచ్చిన రతిక రెమ్యునరేషన్‌ మాత్రం గట్టిగానే తీసుకుందట. రతిక రోజుకు 28 వేలు, ప్రతివారం రూ.2 లక్షల చొప్పున మొత్తం నాలుగు వారాలకు కలిపి రూ. 8 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. ఇంత త్వరగా ఎలిమినేట్‌ అయినప్పటికీ అమ్మడికి గట్టిగానే ముట్టింది కదా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here