సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది..గత కొంతకాలంగా ఎంతోమంది హీరోయిన్లు ఈ విషయాన్ని చెప్పి లబోదిబో అంటున్నారు.. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా తనకు జరిగిన చేదు అనుభవాలను గురించి చెప్పుకుంది. ఆమె ఎవరో కాదు అప్సరా రాణి ( Apsara Rani ).. సినిమా అవకాశాలు వస్తాయి కానీ డైరెక్టర్ ను పూర్తిగా సుఖ పెడితేనే ఆఫర్ లేకుంటే సినిమా అనే పదాన్ని మర్చి పోవాల్సిందే అంటూ పచ్చిగా చెప్పేసింది..
డైరెక్టర్ ప్రొడ్యూసర్ మమ్మల్ని తమ కోరికలు తీర్చమంటూ బలవంతం చేస్తున్నారని అలా వాళ్ల కోరిక తీరిస్తేనే సినిమాలో అవకాశాలు ఇస్తారని డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఎంతోమంది హీరోయిన్స్ ఓపెన్ గానే పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు..అనేక చర్చలకు దారి తీసిన సందర్భాలు కూడా లేకపోలేదు..
థియేటర్స్ లో సినిమా చూడాలంటే టికెట్ ఎలా కొనుక్కోవాలో.. ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగాలంటే సదరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ బెడ్ ఎక్కాల్సిందే అన్నంత కామన్ గా అయిపోయింది ఈ క్యాస్టింగ్ కౌచ్. కాగా ఇప్పటికే ఈ కాస్టింగ్ కౌచ్ పై పలువురు హీరోయిన్స్ మండిపడగా.. దీని గురించి హాట్ హీరోయిన్ అప్సర రాణి ఓపెన్ గానే కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.. థ్రిల్లర్ , డేంజరస్ వంటి సినిమాలతో మరింత పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే..
ఇలా చెప్పడం కన్నా రాంగోపాల్ వర్మ బ్యూటీ అంటే జనాలు టక్కున గుర్తుపట్టేస్తారు . అంతలా ఆయన అండ చూసుకొని సినీ ఇండస్ట్రీలో రెచ్చిపోతుంది బ్యూటీ . అయితే రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేసింది . కన్నడ ఇండస్ట్రీలో తను ఒక సినిమాలో ఆఫర్ వచ్చిందని ..ఎంతో సంతోషించానని తీరా డైరెక్టర్ ఒంటరిగా రూమ్ కి రమ్మనేసరికి మొదట షాక్ అయ్యాను..
ఎందుకో ఏమిటో అని మా నాన్నతో కూడా అక్కడికి వెళ్లానని తీరా అక్కడికి వెళ్ళాక బెడ్ పై అతడు పడుకొని నా కోరిక తీరిస్తేనే నీకు ఆఫర్ ఇస్తానని అనడంతో షాక్ అయ్యాను..అటువంటి ఆఫర్ నాకు వద్దు అని వచ్చేస్తుండగా బలవంతం చేశాడని ఈ క్రమంలోనే నేను మా నాన్న అక్కడి నుంచి పారిపోయి వచ్చేసామని చెప్పుకొచ్చింది..అలాంటి పరిస్థితులు ఎదుర్కొని వచ్చిన అమ్మడు రామ్ గోపాల్ వర్మకు ఎలా పరిచయం అయ్యింది..ఆయనతో ఆ ఫొటోలు ఏంటో?.. ఆమె నటించిన సినిమాలు ఏంటో అంటూ కొందరు జనాలు విమర్శలు చేస్తున్నారు.. ఇక ముందు ముందు ఎటువంటి కంటెంట్ సినిమాలను చేస్తుందొ చూడాలి..