ప్రభాస్ కు అనుష్క ఛాలెంజ్.. పాపం రామ్ చరణ్ బుక్కైయాడుగా..!

- Advertisement -

ప్రభాస్, అనుష్క జోడీ టాలీవుడ్‌లో ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. ఆ మధ్య ఈ ఇద్దరి ఏదో నడుస్తుందని, పెళ్లి పీటలెక్కడమే తరువాయి అని కూడా ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడీ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో ఐదేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనుష్క.. ప్రభాస్ కు ఫేవరెట్ రెసిపీ ఛాలెంజ్ విసరడం విశేషం. ఈ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీలో అనుష్క ఓ చెఫ్ గా కనిపిస్తోంది.

దీంతో తన ఫేవరెట్ వంటకం, దానిని ఎలా తయారు చేయాలో కూడా వివరిస్తూ మంగళవారం (సెప్టెంబర్ 5) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. అంతేకాదు పేరుతో ఓ కొత్త ఛాలెంజ్ కు కూడా తెరతీసింది. ఇందులో భాగంగా తన తొలి ఛాలెంజ్ ను ప్రభాస్ కు విసిరింది. ఇంతకీ ఈ కన్నడ బ్యూటీకి బాగా నచ్చిన వంటకం ఏంటో తెలుసా? మంగళూరు చికెన్ కర్రీ, నీర్ దోశె అట. ఈ రెండు వంటకాలను ఎలా చేయాలో కూడా తన ఇన్‌స్టా పోస్టులో అనుష్క వివరించింది. “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చాలా సరదగా ఉంటుంది. ఇవాళ నేను నా ఫేవరెట్ వంటకం గురించి షేర్ చేస్తున్నాను. అంతేకాదు దీన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఛాలెంజ్ ను ప్రభాస్ కు విసురుతున్నాను.

ఫుడ్ ఎంతగానో ఇష్టపడే వ్యక్తి. అందరి కడుపులూ నింపే వ్యక్తి అతడు. తన ఫేవరెట్ వంటకం గురించి చెప్పడంతో ఛాలెంజ్ కొనసాగించాలని ప్రభాస్ ను ట్యాగ్ చేస్తున్నాను” అని అనుష్క క్యాప్షన్ ఉంచింది. ఇక అనుష్క ఛాలెంజ్ ని స్వీకరించిన ప్రభాస్ తన ఫేవరెట్ డిష్ ఏంటో తెలియజేశాడు. ‘రొయ్యల పలువా’ తన ఫేవరెట్ డిష్ అంటూ అందుకు సంబంధించిన రెసిపీని షేర్ చేశాడు. ఇక ఈ ఛాలెంజ్ ని తను రామ్ చరణ్ కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. మరి రామ్ చరణ్.. ప్రభాస్ ఛాలెంజ్ స్వీకరిస్తాడా..? లేదా..? చూడాలి. ప్రస్తుతం ఈ ఛాలెంజ్ టాలీవుడ్ వైరల్ అవుతుంది. దీనివల్ల తమ ఫేవరెట్ స్టార్స్ ఫేవరెట్ డిష్ లు ఏంటో తెలుస్తున్నాయి. మరి ఈ ఛాలెంజ్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here