మలయాళ సినిమా ‘ప్రేమమ్’తో సినీ ప్రేమికుల హృదయాలు కొల్లగొట్టింది అందాల తార అనుపమ పరమేశ్వరన్. ‘అ ఆ..’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కేరీర్ ప్రారంభంలో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ మళయాలీ అందం ఆ తర్వాత ఆ జోరును నిలుపుకోలేక పోయింది. రంగస్థలం వంటి సినిమాలను చేజేతులా వదులుకోవటంతో ఆమె కెరీర్ గాడితప్పింది. అనంతరం వరుస ఫ్లాప్‌లు సొంతం చేసుకుంది. ఇప్పటికే డజను సినిమాలకు పైగా చేసినా అందులో ఒక్కటీ సరైన హిట్ లభించలేదు. గ్లామర్ షో చేస్తున్నప్పటికీ అనుపమకి సరైన అవకాశాలు దక్కడం లేదు.

ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ సిద్ధు జొన్నలగడ్డతో కలిసి టీజే టిల్లు-2లో నటించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో గ్లామర్ షో గట్టిగా చేయాలని ఫిక్స్ అయిపోయిందట. ఇక ఇదే ఊపులో మరో సినిమాకి అనుపమ పచ్చజెండా ఊపేసింది.సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించనున్న తెలుగు సినిమాలో ఆమె కథానాయికగా నటించడానికి ఎంపికైంది. హ్రిదయం’, ‘జయ జయ జయ జయహే’ వంటి మలయాళ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శన రాజేంద్రన్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు. సంగీత మరో కీలక పాత్రలో నటించనున్నారు.

సినిమాల విషయం పక్కన పెడితే ఈ మళయాలీ బ్యూటీ హాట్‌హాట్ లుక్స్‌తో సోషల్‌మీడియాలో హీట్ పెంచుతుంటుంది. గ్లామర్ షో చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతుంటుంది. తన లేటెస్ట్ ఫోటోషూట్‌లను నెట్టింట అప్‌లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ట్రోలర్స్‌కి అంతగా స్పందించని అనుపమ ఈసారి గట్టి కౌంటర్ ఇచ్చేసింది. ఈ హీరోయిన్ కి పెద్ద సినిమాలు లేవని..
పెద్ద హీరోయిన్ కాదంటూ ఓ నెటిజన్ ట్రోల్ చేశాడు. దీనికి అనుపమ పరమేశ్వరన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. పెద్ద సినిమాలు లేవు ఆమె హీరోయిన్ మెటీరియల్ కాదు అని నెటిజన్ కామెంట్ చేయగా…. ఈ వ్యాఖ్యలకు అనుపమ “కరెక్టే అన్నా హీరోయిన్ టైప్ కాదు నేను యాక్టర్ టైప్” అని రాసి స్మైలీ ఎమోజీని జోడించింది. దీంతో ఆమె అభిమానులు అనుమపకి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.