Anupama Parameshwaran : మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్.. మలయాళం ‘ప్రేమమ్’ సినిమాతో నటిగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తరువాత రెండో సినిమాగా తెలుగులో త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అఆ’ మూవీలో నటించారు. ఆ సినిమాలో అనుపమని చూసి తెలుగు అబ్బాయిలు మనసు పారేసుకున్నారు. ఇక ఆ తరువాత నుంచి మలయాళంతో పాటు తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గా తెలుగులో ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.

ఈ సినిమా 100 కోట్ల మార్క్ ని సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ రీసెంట్ గా సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ అతిథులుగా వచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో టిల్లు స్క్వేర్ సక్సెస్ షీల్డ్ ని ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ చేతుల మీదుగా అనుపమ అందుకున్నారు. ఆ ఫోటోని అనుపమ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..
“ఎనిమిదేళ్ల క్రితం త్రివిక్రమ్ గారితో ‘అఆ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజి షేర్ చేసుకున్నారు. ఆ సమయంలో నాకు తరువాత రాబోయే జర్నీ గురించి ఏమి తెలియదు. అలా మొదలైన నా జర్నీ నేడు టిల్లు స్క్వేర్ గ్రాండ్ సక్సెస్ వరకు చేరుకుంది. ఈరోజు కూడా త్రివిక్రమ్ గారు నాతోపాటు స్టేజి పై ఉన్నారు. లైఫ్ నిజంగానే ఒక సర్కిల్. తెలుగు ఇండస్ట్రీలో నాకు గురువుగా ఉన్న త్రివిక్రమ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎన్టీఆర్ గారు మాస్ కి ఒక నిర్వచనం. ఆయన యాక్టింగ్ అండ్ డైలాగ్ తో నన్ను ఎప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఆయనతో ఇలా స్టేజి ని పంచుకోవడం నాకు దక్కిన ఆశీర్వాదం అనుకుంటున్నాను. ఇక ఆయన దేవర సినిమా చూసి, ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ కి నిలబడి క్లాప్స్ కొట్టే క్షణం కోసం ఎదురు చూస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు.