Jahnvi Kapoor : బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా తన టాలెంట్ తో వరుస అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతుంది. ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఎన్టీఆర్ మాత్రమే కాకుండా రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న ఆర్సి16 మూవీలో కూడా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ అమ్మడు వాడే ప్రతి వస్తువు చాలా స్పెషల్ గా ఉండేలా చూసుకుంటుంది. అందరిలో స్పెషల్ గా కనిపించేందుకు ఎంత ఖరీదైన పెడుతుంది. తాజాగా జాన్వీ వేసుకున్న డ్రెస్స్ ఖరీదు అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. ఆ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే జాన్వీ కపూర్ ఒక సింపుల్ గా ఉండే గౌన్లో కెమెరాకి ఫోజులిచ్చింది. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా సింపుల్ గా ఉండే గౌను ధర స్పెషల్ గా అనిపిస్తుంది.
ఆ గౌను ధర అక్షరాల రూ. 4 లక్షల కు పైనే ఉంటుంది. ఈ గౌన్ ని నయీమ్ ఖాన్ అనే డిజైనర్ తయారు చేశారట. అయితే చూడ్డానికి సింపుల్గా ఉన్నప్పటికీ ఇది వేసుకుంటే చాలాగ్రాండ్ లుక్ కనిపిస్తోంది. అయితే అంత ధర ఎందుకు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ డ్రెస్సులో జాన్వీ ఎంజిల్ లాగా ఉంది.