Pawan Kalyan – Samantha కాంబినేషన్లో మరో సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?

- Advertisement -

Pawan Kalyan – Samantha : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు.ఆ సినిమాలన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా షూటింగ్ ప్రారంభం కాబోతున్నాయి.. అయితే ఆ సినిమాలాన్నీ కూడా కేవలం రోజులలో పూర్తి చెయ్యాలని డైరెక్టర్లకు చెబుతున్నాడు కూడా..పవన్ కళ్యాణ్ నటించబోతున్న ఒక సినిమా కు గాను హీరోయిన్ పాత్ర లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది.

Pawan Kalyan - Samantha
Pawan Kalyan – Samantha

ఆమె ను ఇటీవలే పవన్ కళ్యాణ్ చిత్ర దర్శక నిర్మాతలు సంప్రదించారని, డేట్ల విషయం లో కాస్త సర్దుబాటు చేసేందుకు సమంత ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతుంది.. ఇటీవల సమంత మయో సైటిస్ అనే దీర్ఘ కాలిక వ్యాధి నుండి బయట పడింది. ఆ వ్యాధి కారణంగా దాదాపు ఏడాది కాలం సినిమా లకు దూరంగా ఉంది. వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోవాలని ప్లాన్ లో ఉంది.పవన్ కళ్యాణ్ తో గతంలో అత్తారింటికి దారేది సినిమా ను చేసిన విషయం తెలిసిందే.

ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే పవన్ కళ్యాణ్ తో మళ్లీ సమంత నటించేందుకు గాను ఓకే చెప్పిందట. ఇక అభిమానులు కూడా పవన్ కళ్యాణ్, సమంత ల కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెట్టింట అత్తారింటికి దారేది సినిమా కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

ఈ విషయమై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు.. త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.. వీరిద్దరి కొంబోలో సినిమా చూడాలని అభిమానులు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు.. చూడాలి మరి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here