అంజలి.. బయట ప్రపంచం తో అసలు ఏమాత్రం సంబంధం లేకుండా, ఒక రంగుల ప్రపంచం లాగ అనిపిస్తుంది సినిమా ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ లో హీరో హీరోయిన్ల మధ్య అఫైర్స్ నడవడం అనేది సర్వసాధారణం. కొంతమంది ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నవాళ్ళు ఉన్నారు, మరికొంత మంది డేటింగ్ చేసుకొని కొన్నాళ్ల తర్వాత విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా కొంతకాలం డేటింగ్ చేసుకొని విడిపోయిన ఒక జంట గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము.

అచ్చ తెలుగు అమ్మాయిగా ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వర రావు తెరకెక్కించిన ‘ఫోటో’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైంది అంజలి. ఆ తర్వాత ఈమె ఎక్కువగా అప్పట్లో తమిళ సినిమాల్లోనే నటించింది, అక్కడ ఈమెకు సూపర్ హిట్స్ ఉన్నాయి కూడా. తెలుగు లో ఈమెకి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మరియు ‘వకీల్ సాబ్’ వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా అంజలి కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల్చిపోయిన చిత్రం ఏమిటంటే అందరూ ‘జర్నీ’ అనే చెప్తారు. ఈ సినిమాలో హీరో జై తో ఆమె కెమిస్ట్రీ అద్భుతంగా సెట్ అయ్యింది. నిజ జీవితం లో కూడా వీళ్లిద్దరు ప్రేమికులే, కానీ కొన్ని అనుకోని సంఘటనలు ఎదురు అవ్వడం వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఇది కాసేపు పక్కన పెడితే, అంజలి ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో ఒక ప్రముఖ తమిళ హీరో కొడుకు ఈమెతో ప్రేమాయణం ఒక రేంజ్ లో నడిపాడట.

కలిసి డిన్నర్లకు, పబ్బులకు మరియు పార్టీలలకు ఇలా విచ్చల విడిగా తిరిగేవారట. కానీ ఆ స్టార్ హీరో కొడుకు డేటింగ్ వరకు చేసాడు కానీ, అంజలి పెళ్లి అనే సరికి ఒప్పుకోలేదట. కావాలంటే ఇంకొంత కాలం డేటింగ్ చేద్దామని, పెళ్ళికి మాత్రం నువ్వు సరిపోవు అంటూ తేల్చి చెప్పాడట. అతను చేసిన ఈ మోసం నుండి కోలుకొని మళ్ళీ సినిమాల్లో సెట్ అవ్వడానికి అంజలికి చాలా సమయమే పట్టిందట. ప్రస్తుతం ఈమె రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న ‘గేమ్ చేంజర్‘ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది.