Animal Collections : ఈమధ్య కాలం లో కొన్ని పాన్ ఇండియన్ సూపర్ హిట్ సినిమాలకు 1000 కోట్ల రూపాయిల క్లబ్ అనేది చాలా కామన్ అయిపోయింది. బాహుబలి 2 చిత్రానికి దాదాపుగా 2000 కోట్ల రూపాయిల గ్రాస్ రావడం తో అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కటంటే ఒక్క ఇండియన్ సినిమా కూడా బాహుబలి రికార్డు కి దరిదాపుల్లోకి రాలేకపోయింది. మళ్ళీ రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం 1000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది. ఇక బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠాన్ మరియు జవాన్ చిత్రాలతో రెండు సార్లు వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి ‘ఎనిమల్’ చిత్రం చేరబోతోంది.

రణబీర్ కపూర్ హీరోగా సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గానే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పుతూ ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలై 15 రోజులు పూర్తి అయ్యింది. ఈ 15 రోజులకు గాను ఈ చిత్రం దాదాపుగా 820 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది. ఈ వీకెండ్ తో ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ కి అతి చేరువ లో ఉంటుంది.

కేవలం వెయ్యి కోట్లు వసూలు చెయ్యడం మాత్రమే కాదు, ఫుల్ రన్ ఇప్పట్లో ఆగే సమస్యే లేదు అనిపిస్తుండడం తో కచ్చితంగా ఈ చిత్రం 1400 కోట్ల రూపాయిలు వసూలు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. చాలా మంది ఆడియన్స్ మూవీ రన్ టైం ని చూసి థియేటర్స్ కి కదలడానికి ఆలోచిస్తున్నారు, కాస్త తక్కువ రన్ టైం ఉంటే కచ్చితంగా ఈ చిత్రం మరో రెండు వందల కోట్లు అదనంగా వసూలు చేసి ఉండేది.