Anil Ravipudi : ఈ దసరా కానుకగా విడుదలైన నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఓపెనింగ్స్ విషయం లో కాస్త తడబడినా, లాంగ్ రన్ లో మాత్రం ఈ సినిమా సత్తా చాటుతుంది. ముఖ్యంగా దసరా పండుగ రోజు అయితే ఈ చిత్రం దుమ్ము లేపేసింది. అప్పటి వరకు బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం కష్టమే, కనీసం 10 కోట్ల రూపాయలకు పైగా నష్టం వస్తుందని అనుకున్నారు.

కానీ ఎవ్వరూ ఊహించని రీతిలో దసరా పండగ రోజు ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టడం, అదే రేంజ్ ఊపుని వర్కింగ్ డేస్ లో కూడా ఈ చిత్రం కొనసాగించడం కారణంగా బ్రేక్ ఈవెన్ మార్కు కి చేరువ అయ్యింది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ విషయం లో చాలా కాంట్రవర్సీ ఉంది. నిర్మాత వేసే పోస్టర్స్ కి, నిజంగా వస్తున్నా వసూళ్లకు చాలా తేడా ఉంది.

వాస్తవానికి ఇప్పటి వరకు ఈ చిత్రానికి 58 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా కి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 67 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. అంటే ఇంకా 9 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యాలి అన్నమాట. ఈ 9 కోట్లలో మూడు కోట్లు వీకెండ్ లో రికవర్ అయ్యిందని, మిగిలిన డబ్బులు వచ్చే వారం లో రికవర్ చేస్తుందని అంటున్నారు బయ్యర్స్.

కానీ ఈ చిత్రానికి వచ్చిన ఒరిజినల్ కలెక్షన్స్ కంటే 20 కోట్ల రూపాయిలు వచ్చినట్టు నిర్మాతలు పోస్టర్స్ దింపడం పై సోషల్ మీడియా లో ఈ చిత్రం పై ఒక రేంజ్ లో నెగటివిటీ ఏర్పడింది. దీనిపై డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘మా సినిమాని కొన్న బయ్యర్స్ పెట్టిన ప్రతీ పైసా కి రెండింతల లాభాలు పొంది మంచి జోష్ మీద ఉన్నారు, అది చాలు మాకు, సోషల్ మీడియా లో వచ్చే ట్రోల్ల్స్ ని పట్టించుకోను’ అంటూ కామెంట్ చేసాడు.