Guess The Actress : ‘టైగర్ 3’ టవల్ ఫైట్ లో కనిపించిన ఈ హాట్ బ్యూటీ పవన్ కళ్యాణ్ కి బాగా దగ్గరైన మనిషి.. ఎవరో గుర్తుపట్టారా?

- Advertisement -

Guess The Actress : ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్ లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న చిత్రాలలో ఒకటి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ‘టైగర్ 3’. యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ తెరకెక్కిస్తున్న స్పై యూనివర్స్ నుండి వస్తున్న స్పై థ్రిల్లర్ చిత్రమిది. ‘ఏక్ తా టైగర్’, ‘టైగర్ జిందాహై’, ‘వార్’ మరియు ‘పఠాన్’ సినిమాలకు కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

Guess The Actress
Guess The Actress

ఇందులో మరో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా ‘పఠాన్’ గా కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర ఇందులో 20 నిమిషాలకు పైగానే ఉంటుంది అట. ఇక రీసెంట్ గా విడుదలైన ‘టైగర్ 3 ‘ థియేట్రికల్ ట్రైలర్ కి కూడా ఆడియన్స్ మరియు ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా బాలీవుడ్ నుండి మరో వెయ్యి కోట్ల సినిమాగా నిలుస్తుందని అంటున్నారు.

ఈ ట్రైలర్ లో యాక్షన్ బ్లాక్స్ అందరినీ తెగ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కత్రినా కైఫ్ టవల్ ఫైట్ ని చూసేందుకు ఆడియన్స్ పదే పదే ట్రైలర్ ని చూసారు. ఈ టవల్ ఫైట్ లో కత్రినా కైఫ్ తో పాటు ఉన్న ఇంకో యువతి ఎవరు అనే దానిపై సోషల్ మీడియా లో వెతకడం మొదలు పెట్టారు నెటిజెన్స్. ఆ యువతి పేరు ‘మిచెల్’ అట, ఈమె ఇప్పటి వరకు అనేక హాలీవుడ్ సినిమాల్లో నటించింది.

- Advertisement -

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈ ఫైట్ సన్నివేశం గురించి ఆమె మాట్లాడుతూ ‘టైగర్ 3 చిత్రం లో ఈ ఫైట్ సన్నివేశం హైలైట్ గా నిలుస్తుంది , ఎప్పుడెప్పుడు ఈ సన్నివేశాన్ని వెండితెర మీద చూద్దామా అని ఎదురు చూస్తున్నాను’ అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ సినిమాతో పాటుగా ఆమె పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఓజీ’ లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నట్టు తెలిపింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here