Anikha Surendran .. ఈ పేరు తెలియని వాళ్ళు బహుశా ఉండరు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 20 కు పైగా సినిమాలలో కనిపించింది..ఇక పద్దెనిమిది ఏళ్లకే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది..2019 లో అజిత్ హీరోగా వచ్చిన ‘విశ్వాసం’ సినిమాలో అజిత్ కూతురు శ్వేత పాత్రలో కనిపించి మంచి పేరును అందుకుంది.

నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా పదే పదే టీవీ లలో వస్తుండటం తో జనాలు అనికాను ఇంకా ఈజీగా గుర్తుపడుతున్నారు.. అంతేకాదు ‘ఘోస్ట్’ సినిమాలో నాగార్జున మేనకోడలు అదితి గా కూడా నటించింది.

ఇక ఇప్పుడు రెండో సినిమాకే స్టార్ హీరోయిన్ల ను మించిపోయేలా బోల్డ్ సీన్లలో కనిపిస్తూ ట్రోల్స్ వేయించుకుంటుంది.. ఇక ఇటీవల వచ్చిన ‘బుట్టబొమ్మ’ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా లీడ్ రోల్ పోషించింది ఈ బ్యూటీ. ఆ సినిమాలో సత్య అనే మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిగా చాలా పద్ధతిగా కనిపించింది. అయితే హీరోయిన్ గా చేస్తున్న రెండో సినిమాకి ఈమె ఓ రేంజ్లో గ్లామర్ షో చేసినట్టు స్పష్టమవుతుంది.. అంతేకాదు మలయాళంలో ‘ఓ మై డార్లింగ్’ అనే మూవీలో హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో లిప్ లాక్ లతో రెచ్చిపోయింది అనిఖా సురేంద్రన్. మెల్విన్ జి బాబు హీరోగా నటించిన ఈ మూవీలో అనిఖా బోల్డ్ గా నటించినట్టు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది.. శృతి మించిన శృంగారపు సీన్లలో కనిపించింది.. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇకపోతే సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది.. ఈ మధ్య కాలంలో వరుస ఫోటో షూట్ లు చేస్తూ కుర్రాళ్లకు దగ్గరవుతుంది.. యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది..