Varshini : మల్లెపూలు పెట్టి రొమాంటిక్ గా రెడీ అయిన వర్షిణి..అవి ఇష్టం అంటూ కామెంట్..

- Advertisement -

Varshini : యాంకర్ వర్షిణి పేరు అందరికి తెలుసు..ఈమధ్య యాంకరింగ్ కు దూరమైనా ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ను పలకరిస్తూ ఉంది.. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. ఇప్పుడు మల్లెపూలంటే మహా ఇష్టం. మల్లెమాల తలలో పెట్టుకుని ఓ రొమాంటిక్ వీడియో చేశారు. వర్షిణి వీడియో వైరల్ అవుతుంది.. ఎందుకు వర్షిణి అలా చేసిందా అని జనాలు ఆలోచనలో పడుతున్నారు..

Varshini
Varshini

మంచి ఒడ్డు పొడుగు ఉండి కూడా గ్లామర్ ఫీల్డ్ లో సక్సెస్ కాలేకపోతున్నారు. అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తున్నారు. అటు నటిగా ఇటు యాంకర్ గా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు..శాకుంతలం మూవీలో వర్షిణి తళుక్కున మెరిశారు. చాలా గ్యాప్ తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ మీద కనిపించారు. సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం నిరాశపరిచింది. దీంతో వర్షిణి ఆశలు గల్లంతయ్యాయి. మూవీ హిట్ అయితే వర్షిణి ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యేది.. కానీ సినిమా అనుకున్న హిట్ ను ఇవ్వలేక పోయింది..

Anchor varshini
Anchor varshini

అయితే.. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లిన వర్షిణి క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ తో ఫోటోలు దిగారు. ఇవి వైరల్ అయ్యాయి. వర్షిణి-సూర్య కుమార్ యాదవ్ ఫోటోలపై నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్ చేశారు.. కానీ వాటికి వర్షిణి మాత్రం అస్సలు రెస్పాండ్ అవ్వలేదు.మోడల్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణి చందమామ కథలు చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీలో ఆమె కీలక రోల్ చేశారు. అనంతరం లవర్స్ ,బెస్ట్ యాక్టర్స్ , శ్రీరామ రక్ష అనే చిన్నపాటి చిత్రాల్లో నటించారు..అలాగే పెళ్లి గోల వెబ్ సిరీస్లో నటించారు.హీరోయిన్ కావాలన్న ఆమె ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నట్లు తెలుస్తుంది.. మరి వర్షిణి లైఫ్ ఎలా మారుతుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here