Anchor Suma : సమకు ప్రపోజ్ చేసిన కుర్రాడు..లైవ్ లో ఉండగానే..వీడియో..

- Advertisement -

యాంకర్ సుమకు అందరి ముందే ఓ కుర్రాడు లవ్ ప్రపొజ్ చేశాడు..లైవ్ లో ఉన్నప్పుడు ఇలా చెయ్యడం పై అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి.. కానీ ఇప్పుడు జరిగినది మాత్రం కాస్త ఆసక్తిగా మారింది.. Anchor Suma హోస్ట్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ లో ఇది జరిగింది.. గత కొన్నెల్లుగా ఈ షో సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే… ఈ షోలో సెలెబ్రిటీలు వస్తారు.. అన్ని రకాల వెరియెషన్ ల చూపిస్తున్నారు. దాంతో షోకు జనాల్లొ మంచి ఆదరణ వుంది.కాగా, Anchor Suma హోస్ట్ చేస్తున్న షోల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆమె మాటలతో షోలో ఒక మ్యాజిక్ కు క్రియేట్ చేస్తుంది. అందుకే సుమ ప్రోగ్రామ్ వస్తుంది అంటే మాత్రం అందరూ టీవీ లకు అతుక్కుపోతారు.. ఆమె యాంకరింగ్ అంటే జనాలకు పిచ్చి..

తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ యాంకర్ అంటే సుమ పేరు వినిపిస్తోంది.. అంతలా ఈ అమ్మడు ఫెమస్ అయ్యింది.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. సుమ కేరళ అమ్మాయి. తెలుగు భాషను అవలీలగా మాట్లాడేస్తూ, ప్రోగ్రామ్స్ చేస్తూ తెలుగు సిని ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ అందరి తలలో నాలికలా మారింది. ఈమె లేకుండా ఏ సినీ ఫంక్షన్ జరగదు అనే చెప్పాలి. అలాగే ఆమె ఎప్పటినుండో చేస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ షో ద్వారా సినీ సెలబ్రిటీలను, సీరియల్ సెలబ్రెటీలను తీసుకువచ్చి వారితో ఆటలాడించి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది. ఇంకా సినీ ప్రమోషన్ లో భాగంగా చాలామంది స్టార్స్ ఈ షోలో పాల్గొనడం కూడా జరిగింది.

Anchor Suma

విషయాన్నికొస్తే.. ఈటీవీ లో ప్రసారమవుతున్న లేటెస్ట్ క్యాష్ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఇక ఈ ప్రోగ్రామ్ కు గెస్ట్ లు గా ప్రభాస్ శీను,కమెడియన్ ప్రవీణ్,నటి హరితేజ, నటి హేమ ,పాల్గొనబోతున్నట్లు ప్రోమో ద్వారా క్లారిటీ వచ్చింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అనేక ఆటలను నిర్వహించిన సుమ తర్వాత క్యాష్ ఫిల్మ్ స్కూల్ అనే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లుగా ప్రోమోలో చూపించడం జరిగింది. దీనిలో భాగంగా కమెడియన్ ప్రవీణ్ ను పిలిచి ఈయన లవ్ గురించి ఓ ఫిలిం, క్లాస్ తీయబోతున్నారంటూ ప్రోగ్రామ్ వీక్షించడానికి వచ్చిన ఓ స్టూడెంట్ ను స్టేట్ మీదకు పిలిచారు..

- Advertisement -

సరే పార్క్ లో ఒక అమ్మాయి వెయిట్ చేస్తుందంటూ సుమ తానే అమ్మాయిల వెళ్లి అక్కడ, నిలబడింది. ఇంతలో ప్రవీణ్ అమ్మాయి అన్నారు కదా ఆంటీ ఉందేంటి అంటూ కౌంటర్ వేశాడు. దీంతో ఒక్కసారి అందరూ పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకున్నారు. ఆ తర్వాత స్టేట్ మీదకు వచ్చిన స్టూడెంట్ ను ప్రవీణ్ అమ్మాయి అక్కడ ఆటో కోసం చూస్తుంది ఆటో వచ్చేలోపు వెళ్లి ఐ లవ్ యు చెప్పు అని పంపిస్తాడు. వెంటనే ఆ కుర్రాడు వెళ్లి సుమ ఎదురుగా నిలుచుని మిమ్మల్ని ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాను సుమ గారు మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడంతో, దానికి సుమ నువ్వు మా అబ్బాయి క్లాస్మేట్ కదు అంటూ కౌంటర్ వేసింది.దానికి అందరు నవ్వారు..ఆ తర్వాత ఏం జరిగింది అనేది మాత్రం వచ్చే శనివారం జరిగే ఎపిసోడ్ లో చూడాలి..ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here