Roshan Kanakala : స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగమ్మాయి కాకపోయిన తెలంగాణకు కోడలై యాంకరింగ్ లో కింగ్ అయింది. ప్రస్తుతం బుల్లి తెరతో పాటు.. పలుషోలకు హోస్టింగ్ చేస్తూ బిజీ షెడ్యూల్ మెయింటేన్ చేస్తుంది. ఇటీవల తన కొడుకు రోషన్ టాలీవుడ్ ఎంట్రీ కన్ ఫాం అయింది. త్వరలోనే సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సుమ కొడుకు రోషన్ కనకాల పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఓ పార్టీకి తన ఫ్రెండ్స్‌తో కలిసి కారులో వెళ్తుండగా రోషన్ ను పోలీసులు అడ్డుకున్నారు. విధుల్లో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు రోషన్‌తో పాటు అతని ఫ్రెండ్స్ ఆన్సర్లు ఇవ్వలేకపోయారు. పైగా తమకున్న స్టార్ ఇన్‌ఫ్లూయెన్స్‌ని వాడుకుని అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా వారిని పోలీసులు వదల్లేదు. అనుమానం రావడంతో వారిని కారులో నుంచి దింపి కార్ డిక్కీ ఓపెన్ చేయించారు.
దీంతో భయపడిపోయిన రోషన్ పోలీసులతో డీల్ సెట్ చేసుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు మాత్రం వినకుండా కారు డిక్కీని ఓపెన్ చేయాలని పట్టుబట్టారు. ఇక చేసేదేమి లేక డిక్కీని ఓపెన్ చేశారు రోషన్ తో పాటు అతని స్నేహితులు. అందులో సూట్‌కేస్‌లను తెరచి చూడగా పోలీసులు ఖంగుతిన్నారు. ఆ సూట్ కేసుల్లో జిలేబీలు, బబుల్ గమ్స్ చూసే సరికి వారికి ఏం అర్థం కాలేదు. ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఈ తతంగమంతా ఓ రకమైన ప్రాంక్ అని. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుమ కనకాల కొడుకు హీరోగా ‘బబుల్ గమ్’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తనకు జోడీగా ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి రవిక్రాంత్ దర్శకత్వం వహించాడు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి ప్రాంక్ క్రియేట్ చేశాడు రోషన్.