Hansika : ఈ రోజుల్లో హీరోయిన్స్ దేనికైనా సై అంటున్నారు.. శ్రీలీల కూడా అన్ని చేసేసింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన హన్సిక

- Advertisement -

Hansika : ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలాంటి వారిలో హన్సిక ఒకరు. ఇతర భాషల్లో హన్సిక.. ఏడాదికి ఒక మూవీ అయినా విడుదల చేస్తుందేమో కానీ తెలుగులో మాత్రం తను కనీసం మూడేళ్లకు ఒకసారి కనిపిస్తోంది. ఇక తను నటించిన తెలుగు చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు హన్సిక.

Hansika
Hansika

తాజాగా తన పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో అప్పటికి, ఇప్పటికి ఉన్న తేడాలతో పాటు ఈతరం హీరోయిన్ల గురించి కూడా తన అభిప్రాయాలను బయటపెట్టింది. తెలుగులో ప్రస్తుతం బాగా నటిస్తున్న హీరోయిన్లు ఎవరు అని అడగగా.. వెంటనే శ్రీలీల పేరు చెప్పింది హన్సిక. ‘‘తను చాలా అందంగా ఉంటుంది. మంచి నటి. నాకు తన వర్క్ ఇష్టం’’ అని బయటపెట్టింది. అయితే ప్రస్తుతం యంగ్ హీరోయిన్లను చూస్తుంటే తను ఎలా ఫీలవుతుంది అని అడగగా.. ‘‘నేను వాళ్లని యంగ్, సీనియర్ అన్నట్టుగా చూడను. నాకు నేను ఓల్డ్ అని ఎప్పుడూ అనుకోను’’ అని తెలిపింది.

వయసు గురించి కాకపోయినా అనుభవం విషయంలో అయినా రోజులు మారాయని, ఎవరి అనుభవం వారికి ఉంటుందని చెప్పుకొచ్చింది. ‘‘నేను ఎనిమిదేళ్లు ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్నాను. ఆ తర్వాత 15 ఏళ్లకే హీరోయిన్‌గా మారాను. కానీ అప్పుడు ఉన్న ఎక్స్‌పీరియన్స్‌కు, ఇప్పుడు ఉన్న ఎక్స్‌పీరియన్స్‌కు చాలా తేడా ఉంది. ఇదంతా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎవరి ప్రయాణం వారిది. మన అనుభవాలే మనకు పాఠాలు అవుతాయి. కానీ ఈరోజుల్లో నటించడానికి వస్తున్నవారు పూర్తిగా రెడీగా వస్తున్నారు. వారు అన్నింటికి రెడీగా ఉంటున్నారు. నేర్చుకోవడంలో కూడా చురుగ్గా ఉంటున్నారు. అప్పట్లో అలా లేదు. అప్పట్లో కొంచెం డిఫరెంట్‌గా ఉండేది. కాబట్టి అన్నింటిలో లాభాలు, నష్టాలు ఉన్నాయి’’ అని హన్సిక తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here