Anchor Rashmi : జబర్దస్త్ షోతో బుల్లితెరపై యాంకర్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది రష్మీ గౌతమ్. జబర్ధస్త్ ద్వారా మరింత పాపులర్ అయినా వెండితెరపై మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఒక పక్క యాంకరింగ్ చేస్తూ మరో పక్క సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఒకప్పుడు హీరోయిన్గా కూడా పలు సినిమాల్లో చేసిన ఆమె ప్రస్తుతం మెగాస్టార్ లాంటి బడా హీరోల సినిమాల్లో చిన్న పాత్రలు వచ్చినా చాలని ఈజీగా చేస్తోంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలు అక్కడ పోస్ట్ చేస్తుంది.
సమాజంలో ఎక్కువగా మూగజీవాల హక్కుల గురించి, సమాజంలో మహిళల గురించి రష్మీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశమైంది. మహిళలు, సెక్స్ అనే అంశాలకు సంబంధించిన రష్మీ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఒక కొటేషన్ ని ఆమె షేర్ చేసింది. ప్రముఖ రైటర్ రచల్ మోరన్ రాసిన ఒక కొటేషన్ ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో వ్యభిచారం, మహిళల పేదరికానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడంతో అదే హాట్ టాపిక్ అవుతుంది.
మహిళలు పేదరికంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నప్పుడు మనిషిగా మనం చేయాల్సింది వారికి తిండిపెట్టడం కానీ.. డిక్ కాదు అంటూ కాస్త ఘాటుగానే సదరు రచయిత రాసిన కొటేషన్ ని రష్మీ షేర్ చేసింది. నిజానికి ఈ కొటేషన్ ఒక సందర్భంలో వస్తుంది. ఆ సందర్భం ఏమిటంటే వ్యభిచారంలో మునిగిపోయిన ఒక మహిళ వ్యభిచారం గురించి మాట్లాడుతూ చాలామంది మగాళ్లు మంచివాళ్లు అయితే అసలు వ్యభిచారం అనేది ఉండదు.. దానికి మనుగడ ఉండదంటూ మహిళల వ్యభిచారం.. ఆకలి గురించి చెప్పిన డైలాగ్ ని రష్మీ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఈ పోస్ట్ దేని గురించి పెట్టిందా అంటూ.. నెట్టింట హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారు.